Kidney racket ముఠా గుట్టురట్టు, 10 మంది అరెస్టు

ABN , First Publish Date - 2022-06-01T21:05:14+05:30 IST

దక్షిణ ఢిల్లీలో గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు సాగిస్తున్న ఓ కిడ్నీ రాకెట్ ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు..

Kidney racket ముఠా గుట్టురట్టు, 10 మంది అరెస్టు

న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలో గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు సాగిస్తున్న ఓ కిడ్నీ రాకెట్ ముఠా (Kidney racket gang) గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న ఈ ముఠాలోని 10 మందిని అరెస్టు చేశారు. హౌజ్ ఖాస్ పోలీస్ స్టేషన్‌లో ఇందుకు సంబంధించిన కేసు నమోదైంది. అరెస్టు చేసిన పది మందిలో ఒక డాక్టరు, పలువురు టెక్నీషియన్లు, హెల్పర్లు ఉన్నట్టు పోలీసులు చెప్పారు. సోనిపట్‌లో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసిన అక్కడే పేషెంట్లకు మూత్రపిండాల (Kidney) ఆపరేషన్లు నిర్వహించే వారని తెలిపారు.


''ఆపరేషన్ కోసం పేషెంట్ నుంచి లక్షల్లో ఫీజు వసూలు చేసేవాడినని పట్టుబడిన వైద్యుడు విచారణలో వెల్లడించాడు. ఆరు నెలల్లో సుమారు 14 మందికి ఆపరేషన్లు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు చెప్పాడు. మా విచారణలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది'' అని పోలీసులు తెలిపారు. ప్రధానంగా పేద ప్రజలను టార్గెట్‌గా చేసుకుని డాక్టర్ ఎక్కువ డబ్బులు ఆశచూపించే వాడని విచారణలో వెల్లడయినట్టు తెలుస్తోంది. క్లయింట్స్ కోసం ఆయన సోషల్ మీడియాలో ప్రచారం చేసిన్టటు చెబుతున్నారు. ఈ కేసులో మరింత మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలున్నాయి.

Updated Date - 2022-06-01T21:05:14+05:30 IST