ఓటు వేయనందుకు ఈసీ రూ.350 జరిమానా... పుకార్లపై Delhi Police దర్యాప్తు

ABN , First Publish Date - 2021-12-06T12:32:50+05:30 IST

ఢిల్లీ పోలీసులు ఓటు వేయనందుకు ఎన్నికల కమిషన్(ఈసీ)350రూపాయల జరిమానా విధిస్తుందనే పుకారుపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు...

ఓటు వేయనందుకు ఈసీ రూ.350 జరిమానా... పుకార్లపై Delhi Police దర్యాప్తు

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు ఓటు వేయనందుకు ఎన్నికల కమిషన్(ఈసీ)350రూపాయల జరిమానా విధిస్తుందనే పుకారుపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం ఓటు వేయని వ్యక్తుల బ్యాంకు ఖాతాల నుంచి ఎన్నికల సంఘం రూ.350 మినహాయించనుందని ధృవీకరించని వార్త కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.సోషల్ మీడియాలో ఎన్నికల కమిషన్ స్వయంగా ఈ వార్తలను పుకార్లుగా పేర్కొంది.ఈ పుకార్లపై ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చినప్పటికీ కూడా సోషల్ మీడియాలో పుకార్ల ప్రచారానికి తెరపడలేదు.దీంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, ఈ విషయంపై దర్యాప్తు బాధ్యతను ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగానికి అప్పగించారు. నాన్‌ కన్‌సైన్‌బుల్‌ నేరం కింద పోలీసులు చర్యలు ప్రారంభించారు.ఈ కేసును డీసీపీ కేపీఎస్ మల్హోత్రా దర్యాప్తు చేస్తున్నారని ఢిల్లీ పోలీసులు వివరించారు.


Updated Date - 2021-12-06T12:32:50+05:30 IST