
న్యూఢిల్లీ:వారణాసికి చెందిన జ్ఞాన్వాపి మసీదుపై ఫేస్బుక్ పోస్ట్ పెట్టినందుకు ఢిల్లీ ప్రొఫెసరును పోలీసులు అరెస్ట్ చేశారు. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు సముదాయంలో లభించిన శివలింగం గురించిన ఆరోపణలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టినందుకు ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హిందూ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ రతన్ లాల్‌ను శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు.ఢిల్లీ ప్రొఫెసర్ రతన్ లాల్ తన అభిప్రాయాన్ని సమర్థిస్తూ, ఒక చరిత్రకారుడిగా తాను అనేక పరిశీలనలు చేశానని పేర్కొన్నారు.

ప్రొఫెసర్ లాల్ పై ఐపీసీ 153 ఏ, 295 ఎల కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాది దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు లాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.లాల్ ఇటీవల శివలింగంపై అవమానకరమైన, రెచ్చగొట్టేలా పోస్టు చేశారని తన ఫిర్యాదులో న్యాయవాది వినీత్ జిందాల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి