ఢిల్లీలో ఈ-రిక్షాను ఢీకొన్న కారు...ఇద్దరి దుర్మరణం

Jun 15 2021 @ 09:09AM

న్యూఢిల్లీ : డ్రైవరు పీకలదాకా మద్యం తాగి కారు నడపటం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన ఢిల్లీలో సోమవారం రాత్రి జరిగింది.ఢిల్లీలోని డిలైట్ సినిమా హాలు వద్ద డ్రైవరు మద్యం తాగి కారును వేగంగా నడుపుతూ ఓ కుటుంబం ప్రయాణిస్తున్న ఈ-రిక్షాను ఢీకొట్టాడు.ఈ రోడ్డు ప్రమాదంలో ఈ రిక్షా డ్రైవరుతోపాటు ఓ మహిళ మరణించారు. ఈ-రిక్షాలో ఉన్న భర్త, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిని వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవరు పారిపోతుండగా పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. మద్యం తాగి కారును వేగంగా నడపటం వల్లనే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.

Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.