Viral Video: గతంలో స్కూల్లో విద్యార్థులకు పాఠాలు బోధించిన టీచర్.. నేడు రోడుపై ఇలా..

ABN , First Publish Date - 2022-02-20T23:03:11+05:30 IST

పుస్తకాలు పట్టుకుని విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయురాలు.. ప్రస్తుతం గరిట పట్టుకుంది. ఆహార పదార్థాలను స్వయంగా వండి.. ప్లేటు రూ.60 చొప్పున రోడ్డుపై అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు స్పందిస్తూ

Viral Video: గతంలో స్కూల్లో విద్యార్థులకు పాఠాలు బోధించిన టీచర్.. నేడు రోడుపై ఇలా..

ఇంటర్నెట్ డెస్క్: పుస్తకాలు పట్టుకుని విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయురాలు.. ప్రస్తుతం గరిట పట్టుకుంది. ఆహార పదార్థాలను స్వయంగా వండి.. ప్లేటు రూ.60 చొప్పున రోడ్డుపై అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని రోడ్డున పడేసింది. మహమ్మారి ప్రభావానికి ఉపాధిని కోల్పోయిన వారి జాబితాలో ఢిల్లీకి చెందిన సుమన్ కూడా ఉన్నారు. అప్పటి వరకూ ఢిల్లీలోని ఓ ప్రముఖ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్న ఆమె.. కరోనా కారణంగా ఉద్యోగాన్ని కోల్పోయింది. దీంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. పరిస్థితులు ఎప్పుడైనా తారుమారు కావొచ్చని ఆలోచించి.. ఇకపై ఒకరి దగ్గర పని చేయకూడదని డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే గతంలో పుస్తకాలు పట్టుకున్న ఆమె.. గరిట పట్టుకుంది. ఇంటి వద్ద పెద్ద మొత్తంలో ఆహార పదార్థాలను వండుతూ.. వాటిని రోడ్డుపై ఏర్పాటు చేసిన స్టాల్‌లో ప్లేటు రూ.60 చొప్పున బాటసారులకు అమ్ముతోంది. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అదికాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు.. ఆమె పాజిటివ్ యాటిట్యూడ్ చూసి హ్యాట్సప్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.






Updated Date - 2022-02-20T23:03:11+05:30 IST