న్యూఢిల్లీ: ఉక్రెయిన్ నుంచి తెలుగు విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. ఈరోజు 145 మంది తెలుగు విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. నాలుగు ప్రత్యేక విమానాల్లో ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి ఏపీ(83), తెలంగాణ(62) మంది విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ వచ్చిన విద్యార్థులకు ఏపీ, తెలంగాణభవన్‌లో అధికారులు వసతి, భోజన ఏర్పాట్లు చేశారు. సాయంత్రం విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు ఏపీ, తెలంగాణభవన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి