కోవిడ్‌తో సహజీవనం తప్పదు: మనీష్ సిసోడియా

ABN , First Publish Date - 2022-04-19T22:41:24+05:30 IST

కరోనా వైరస్‌తో సహజీవనం చేయడానికి అందరూ అలవాటు పడాలని, ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదలను..

కోవిడ్‌తో సహజీవనం తప్పదు: మనీష్ సిసోడియా

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో సహజీవనం చేయడానికి అందరూ అలవాటు పడాలని, ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదలను సమర్ధవంతంగా అరికట్టేందుకు నిపుణుల సలహా తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. కీలకమైన డీడీఎంఏ బుధవారం జరగనుండగా మంత్రి తాజా ట్వీట్‌లో ఈ వివరాలు తెలియజేశారు.


కాగా, గత వారం మనీష్ సిసోడియా కరోనా కేసులపై మాట్లాడుతూ, ఢిల్లీలో కేసులో పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య స్వల్పంగానే ఉన్నందున ఆందోళన అవసరం లేదని అన్నారు. కరోనా కేసులు ఉన్నట్టు కనిపిస్తే ప్రభుత్వ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను అనుసరించాలని స్కూళ్లకు ఆదేశాలిచ్చామని చెప్పారు. ఇన్‌ఫెక్షన్ కేసులు వెలుచూసిన క్లాస్, విభాగాలను మూసివేయాలని సూచనలు ఇచ్చినట్టు తెలిపారు. నిర్ధిష్ట కేసుల విషయంలో మాత్రమే స్కూళ్లు మొత్తం మూసివేయడం జరుగుతుందని వివరించారు. పరిస్థితిని త్వరలోనే సమీక్షిస్తామని అన్నారు.


పెరుగుతున్న కేసులు...పాజిటివిటీ రేటు

ఢిల్లీలో సోమవారంనాడు కొత్తగా 501 కరోనా కేసులు నమోదైనప్పటికీ మరణాలు చోటుచేసుకోలేదు.  పాజిటివిటీ రేటు 7.72గా ఉంది. ఆదివారంనాడు పాటిటివిటీ రేటు 4.21గా ఉంది. కాగా, దేశ రాజధానిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా  తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించేందుకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ (డీడీఎంఏ) ఈనెల 20న సమావేశమవుతోంది.                       


Updated Date - 2022-04-19T22:41:24+05:30 IST