మరీ ఇంత దారుణమా.. 14 సార్లు అబార్షన్.. భరించలేక మహిళ ఆత్మహత్య.. షాకింగ్ ఘటన.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-07-15T20:12:19+05:30 IST

అసాధారణంగా 8 ఏళ్లలో 14 సార్లు అబార్షన్లు(Abortions).. ఎప్పుడు గర్భం వచ్చినా తీయించుకోవాలని ఒత్తిడి.. సహజీవనం

మరీ ఇంత దారుణమా.. 14 సార్లు అబార్షన్.. భరించలేక మహిళ ఆత్మహత్య..  షాకింగ్ ఘటన.. అసలేం జరిగిందంటే..

న్యూఢిల్లీ : అసాధారణంగా 8 ఏళ్లలో 14 సార్లు అబార్షన్లు(Abortions).. ఎప్పుడు గర్భం వచ్చినా తీయించుకోవాలని ఒత్తిడి.. సహజీవనం (Live-in relationship)లో భాగస్వామి (live-in partner)నరకాన్ని భరించలేక 33 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఢిల్లీ(Delhi)లో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు గురువారం వెలుగుచూశాయి. మృతి చెందిన మహిళ ఎనిమిదేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత ఓ వ్యక్తితో సహజీవనం కొనసాగించింది. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేయడంతో ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె 14 సార్లు గర్భం దాల్చింది. ప్రతిసారీ అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. విధిలేని పరిస్థితుల్లో అతడు చెప్పిన మాటే విన్నది. ఇకనైనా పెళ్లి చేసుకోమని అడిగిన ప్రతిసారీ సమాధానం దాటవేస్తూ వచ్చాడు. చివరికి ఇటు పెళ్లీ లేక.. అటు అబార్షన్లు చేయించుకోలేక విసుగు చెందిన బాధితురాలు జులై 5న ఆత్మహత్య చేసుకుంది. ఢిల్లీ దక్షిణ ప్రాంతంలోని జైత్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ మేరకు ఆమె హిందీలో రాసిన సూసైడ్ లెటర్ లభ్యమైందని పోలీసులు వివరించారు. నిందిత వ్యక్తి నోయిడాలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని, అతడిపై కేసు నమోదు చేశామని వివరించారు. 


మృతురాలి దుస్తుల్లో సూసైడ్ నోట్‌ను ఎయిమ్స్ వైద్యులు గుర్తించి దించారని, అత్యాచారంతోపాటు పలు సెక్షన్ల కింద నిందితుడిపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు సోదాలు జరుగుతున్నాయని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఈశాన్యం) ఇషా పాండే మాట్లాడుతూ... ‘‘ జులై 5న మాకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా గదిలో మహిళ వేలాడుతోంది. తక్షణమే ఎయిమ్స్ హాస్పిటల్‌కు తరలించాం. కానీ ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్యకు ఉపయోగించిన స్టూలుతోపాటు ఆమె మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాం. మృతురాలు గత ఏడేనిమిదేళ్లుగా ఆమె భర్తకు దూరంగా నివసిస్తోందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆమె తల్లిదండ్రులు బీహార్‌లో ఉంటున్నారు. మృతదేహాన్ని  వారికి అప్పగించాం .’’ అని వివరించారు.

Updated Date - 2022-07-15T20:12:19+05:30 IST