14 రోజుల రిమాండ్... వినాయక నిమజ్జనాలే వారి టార్గెట్

ABN , First Publish Date - 2021-09-16T01:39:21+05:30 IST

పాకిస్థాన్ వెళ్లి ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ పొందిన ఇద్దరు ముష్కరులతో సహా మొత్తం ఆరుగురు టెర్రరిస్టుల్ని 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. ముందుగా జాన్ మహ్మద్ అలీ షేక్, ఒసామా, మూల్ చంద్, జీషన్ ఖమర్, మహ్మద్ అబూబకర్, మహ్మద్ ఆమీర్ జావేద్‌లను ఢిల్లీలోని పటియాల హౌస్ కోర్టులో పోలీసులు హాజరపర్చగా న్యాయమూర్తి వార్ని రెండు వారాల రిమాండ్‌కు అనుమంతిచారు.

14 రోజుల రిమాండ్... వినాయక నిమజ్జనాలే వారి టార్గెట్

పాకిస్థాన్ వెళ్లి ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ పొందిన ఇద్దరు ముష్కరులతో సహా మొత్తం ఆరుగురు టెర్రరిస్టుల్ని 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. ముందుగా జాన్ మహ్మద్ అలీ షేక్, ఒసామా, మూల్ చంద్, జీషన్ ఖమర్, మహ్మద్ అబూబకర్, మహ్మద్ ఆమీర్ జావేద్‌లను ఢిల్లీలోని పటియాల హౌస్ కోర్టులో పోలీసులు హాజరపర్చగా న్యాయమూర్తి వార్ని రెండు వారాల రిమాండ్‌కు అనుమంతిచారు. 

రిమాండ్‌లో ఉన్న ఉగ్రవాదుల్లో ఒసామా, జీషన్ ఖమర్ మస్కట్ మీదుగా అక్రమంగా పాకిస్థాన్‌కు వెళ్లి బాంబుల తయారీలో శిక్షణ పొందారు. అనేక నగరాల్లో వాళ్లు పేలుళ్లకు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. ఇక అలీ షేక్, మూల్ చంద్ పాక్‌లోని దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీంతో టచ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరిపై ఉగ్రదాడికి ఆయుధాలు సరఫరా చేసే బాధ్యత మోపబడిందని అంటున్నారు. 

మరో ఉగ్రవాది జాన్ మహ్మద్ అలీ షేక్ ముంబైలోనే పుట్టిపెరిగాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అతడు దక్షిణ ముంబైలోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్టుగా తేలింది. ఏళ్ల తరబడి డ్రైవర్‌గా పని చేసిన జాన్ మహ్మద్ వినాయక నిమజ్జనం సందర్భంగా భారీ పేలుళ్లకు, హింసకు కుట్ర పన్నాడని యాంటి టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్స్ తెలిపారు.         

Updated Date - 2021-09-16T01:39:21+05:30 IST