ఢిల్లీలో రైతులపై కాల్పులు అన్యాయం

ABN , First Publish Date - 2020-12-04T04:51:20+05:30 IST

వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

ఢిల్లీలో రైతులపై కాల్పులు అన్యాయం
ఢిల్లీ రైతులకు మద్దతుగా ఏలూరులో రాస్తారోకో చేస్తున్న నాయకులు

ఏలూరుకార్పొరేషన్‌/భీమడోలు, డిసెంబరు 3 : వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని  ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో పోరాడు తున్న రైతులకు సంఘీభావంగా ఏపీ రైతు సంఘం, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వ ర్యంలో ఏలూరులో గురువారం రాస్తారోకో చేశారు. రైతు సంఘం నాయకుడు కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఢిల్లీలో పోరాడుతున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించడం దారుణమన్నారు. అన్నదాతలపై పోలీసు కాల్పులు అన్యాయమన్నారు. సీపీఎం ఏలూరు నగర కార్యదర్శి టి.కిషోర్‌ మాట్లాడుతూ అప్రజాస్వామికంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.ఢిల్లీ ఆందోళనలో ఇప్పటికి ఇద్దరు రైతులు చని పోవడం బాధాకరమని అన్నారు.కాంగ్రెస్‌ ఏలూరు నగర అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్‌రావు మాట్లాడుతూ ఇకనైనా బీజేపీ మెట్టుది గిరావాలన్నారు. లేకపోతే దేశ వ్యాప్తంగా రైతుల పోరాటం ఉధృతం అవుతు ందని హెచ్చరించారు.భీమడోలు మండలం గుండుగొలను, పూళ్ళ జాతీయ రహదారిపై సీఐటీయూ, రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. సీఐ టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు లింగరాజు మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టా లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులు చేస్తున్న పోరాటం న్యాయ బద్ధమైందని అన్ని పార్టీలు సంస్ధలు మద్దతుగా నిలబడాలన్నారు.రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కార్పొరేట్ల నుంచి రక్షించుకునేందుకు ఢిల్లీలో మరో స్వాతంత్య్ర పోరాటం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ప్రసాద్‌,కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కె.రవీంద్ర,వాడపల్లి రామారావు, పైడిపాటి భాస్కర్‌, బి.లక్ష్మణ్‌రావు, ముసునూరు కొండలరావు, తలారి జయరాజు, సీపీ ఎం నాయకులు బి.సాయిబాబు, బి.జగన్నాథరావు, పి.ఆదిశేషు, సత్య నారా యణ, పిల్లి రామకృష్ణ, దండుబోయిన చంద్రశేఖర్‌, సేవాదళ్‌ సుబ్బారావు, నాగేశ్వరరావు, పైడి వెంకటేశ్వరరావు, త్రిమూర్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T04:51:20+05:30 IST