చూచువారలకు చూడముచ్చటగా

ABN , First Publish Date - 2021-02-25T05:52:00+05:30 IST

పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ ఉత్సవాల్లో విశేష ఘట్టమైన ఎదుర్కోలు మహోత్సవం బుధవారం రాత్రి నేత్రపర్వంగా సాగింది. అశ్వవాహనంపై నృసింహు డు, ముత్యాల పల్లకిలో మహాలక్ష్మి అమ్మవారిని ఆలయ కల్యాణమండ పం చెంతకు మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ తీసుకొచ్చిన అర్చకస్వాములు ఎదుర్కోలు మహోత్సవాలను సంప్రదాయరీతిలో నిర్వహించారు.

చూచువారలకు చూడముచ్చటగా
పాతగుట్టలో ఎదుర్కోలు నిర్వహిస్తున్న అర్చకులు, ఆలయ సిబ్బంది

పాతగుట్ట ఆలయంలో ఎదుర్కోలు, తిరుకల్యాణ ఉత్సవాలు


యాదాద్రి టౌన్‌, ఫిబ్రవరి 24: పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ ఉత్సవాల్లో విశేష ఘట్టమైన ఎదుర్కోలు మహోత్సవం బుధవారం రాత్రి నేత్రపర్వంగా సాగింది. అశ్వవాహనంపై నృసింహుడు, ముత్యాల పల్లకిలో మహాలక్ష్మి అమ్మవారిని ఆలయ కల్యాణమండపం చెంతకు మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ తీసుకొచ్చిన అర్చకస్వాములు ఎదుర్కోలు మహోత్సవాలను సంప్రదాయరీతిలో నిర్వహించారు. స్వామి దయాగుణం, భక్తి పరాయణత్వం, మహిమాన్వితాన్ని, మహాలక్ష్మి అమ్మవారి సిరిసంపదలు, గుణగణాలను అర్చక,అధికార బృందం ఆధ్మాత్మిక వాద, సంవాదాల నడుమ ఎదుర్కోలు మహోత్సవం అత్యంత ఆహ్లాదభరితంగా సాగింది. లోకకల్యాణం, విశ్వశాంతి కోసం జగత్‌ రక్షకులైన లక్ష్మీనరసింహుల తిరుకల్యాణోత్సవాన్ని గురువారం రాత్రి 8.10గంటలకు వేద పండితులు నిర్ణయించిన  సుమూహుర్తంలో నిర్వహించడానికి ముహూర్తం ఖరారుచేశారు. ఈ ఆధ్యాత్మిక పర్వాలను దేవస్థాన ప్రధానర్చకుడు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకుడు రంగాచార్యులు, పాతగుట్ట ముఖ్య అర్చకుడు కొండకండ్ల మాధవాచార్యులు నిర్వహించగా, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో ఎన్‌.గీతారెడ్డి, ఏఈవో దోర్భల భాస్కరశర్మ, పర్యవేక్షకుడు శంకర్‌నాయక్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సుధాహేమేందర్‌గౌడ్‌, పాల్గొన్నారు.  

Updated Date - 2021-02-25T05:52:00+05:30 IST