గుర్రంపై Swiggy ఆర్డర్ల డెలివరీ బాయ్.. ఎవరో తెలిసిపోయింది.. ఇంతకీ ఆ బ్యాగులో ఉన్నది ఏంటో తెలుసా..

ABN , First Publish Date - 2022-07-10T23:53:40+05:30 IST

ఇటీవల ముంబైలో ఓ స్విగ్గీ(Swiggy) ఫుడ్ డెలివరీ బాయ్‌కి సంబంధించిన వీడియో ఒకటి బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. వర్షం పడుతున్నా.. లెక్క చేయకుండా ఫుడ్ డెలివరీ..

గుర్రంపై Swiggy ఆర్డర్ల డెలివరీ బాయ్.. ఎవరో తెలిసిపోయింది.. ఇంతకీ ఆ బ్యాగులో ఉన్నది ఏంటో తెలుసా..

ఇటీవల ముంబైలో ఓ స్విగ్గీ(Swiggy) ఫుడ్ డెలివరీ బాయ్‌కి సంబంధించిన వీడియో ఒకటి బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. వర్షం పడుతున్నా.. లెక్క చేయకుండా ఫుడ్ డెలివరీ చేసేందుకు గుర్రంలో వెళ్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే, ఆర్డర్ల డెలివరీకి గుర్రాన్ని ఎలా ఎంపిక చేసుకున్నాడన్నదే చాలా మందికి వచ్చిన అనుమానం. దీనిపై భారీ ఎత్తున నెటిజన్లు స్పందించారు. ఇది కాస్తా స్విగ్గీ దృష్టికి వెళ్లింది. దీంతో స్విగ్గీ కూడా స్పందించింది. అదే సమయంలో కూసింత వ్యంగ్యంతో కూడిన ఓ 'బహుమాన' ప్రకటన సైతం విడుదల చేసింది..


గుర్రంపై వెళ్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ వివరాలు తమకు తెలియజేస్తే.. వారి స్విగ్గీ ఖాతాలో రూ.5,000 జమ చేస్తామంటూ ప్రకటించింది. తాజాగా ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారం తమకు తెలిసిందంటూ Swiggy ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం, గుర్రంపై ఉన్న వ్యక్తి 17 ఏళ్ల సుశాంత్ అని, అతను స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ కాదని, పెళ్లి ఊరేగింపు సందర్భంగా గుర్రాలను అలంకరించే పని చేస్తుండాడని తెలిసింది. ఆ గుర్రం పేరు శివ. అయితే ఆ బ్యాగ్‌లో ఎలాంటి ఆర్డర్ లేవు. పెళ్లి ఊరేగింపుల కోసం గుర్రాలపై ఉంచే అలంకరణ వస్తువులను తీసుకెళ్తున్నాడు. ఆ యువకుడు ఒక పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నట్లు Swiggy తెలిసింది. అవీ అనే వ్యక్తి, అతని స్నేహితుడు ఈ వీడియోను షేర్ చేసినట్లు గుర్తించారు. ఎట్టకేలకు Swiggy ప్రకటించిన మొత్తాన్ని వారు అందుకున్నారు.

Viral Video: గుర్రంపై Swiggy ఆర్డర్ల డెలివరీ.. డెలివరీ బాయ్ ఆచూకీ చెప్పాలంటూ స్విగ్గీ బంపరాఫర్





Updated Date - 2022-07-10T23:53:40+05:30 IST