ఇబ్బంది లేకుండా సరుకులు పంపిణీ చేయాలి

ABN , First Publish Date - 2022-06-28T06:47:52+05:30 IST

ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్‌ ఎన్‌.నటరాజ్‌ రేషన్‌ డీలర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో చౌకధరల దుకాణదారులకు విజన్‌ టేక్‌ సౌజన్యంతో

ఇబ్బంది లేకుండా సరుకులు పంపిణీ చేయాలి
మిషన్‌లను అందజేస్తున్న అదనపు కలెక్టర్‌ నటరాజ్‌

రేషన్‌ డీలర్లకు అదనపు కలెక్టర్‌ నటరాజ్‌ ఆదేశం

ఆదిలాబాద్‌ టౌన్‌, జూన్‌ 27: ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్‌ ఎన్‌.నటరాజ్‌ రేషన్‌ డీలర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో చౌకధరల దుకాణదారులకు విజన్‌ టేక్‌ సౌజన్యంతో ఈ పాస్‌ మిషన్‌ల పై నిర్వహించిన శిక్షనకార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ చౌకధరల దుకాణదారులు ప్రజలకు ఇబ్బందులు రానీయకుండా ప్రతీ నెల సకాలంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని సూచించారు. గతంలో 2జీ నెట్‌వర్క్‌ ద్వారా నూతన సాంకేతిక మిషన్‌లను పంపిణీ చేస్తామన్నారు. అనంతరం అదనపు కలెక్టర్లు చౌకధరల దుకాణదారుల కు ఈపాస్‌ యంత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాథోడ్‌రమేష్‌, జిల్లా పౌర సరఫరాల అధికారి సుదర్శన్‌, సర్వీస్‌ ఇంజనీర్లు హరినాథ్‌, నాగరాజ, కో ఆర్డినేటర్‌ అశోక్‌, రేషన్‌ డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.

 పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి

పట్టణంలో వర్షాకాలం దృష్ట్యా పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా షేక్‌ మున్సిపల్‌ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి పై మున్సిపల్‌, వార్డు ప్రత్యేక అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా పరిసరాల పరిశుభ్రత, పారివుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలన్నారు. తడి, పొడి చెత్తను వేరు వేరుగా సేకరించి డంపింగ్‌యార్డుకు తరలించాలన్నారు. ఇందులో మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ, తహసీల్దార్‌లు సతీష్‌, వనజా, వార్డు ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T06:47:52+05:30 IST