ఏఎస్‌ఐపై చర్యలకు కొత్తపేట వాసుల డిమాండ్‌

ABN , First Publish Date - 2021-05-11T07:21:07+05:30 IST

అమాయకుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్న గుడ్లూరు ఏఎస్‌ఐ మురళీ ధర్‌ రావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం పోలీసు స్టేషన్‌ ఎదుట కొత్త పేట గ్రామస్థులు ఆందోళనకు దిగారు.

ఏఎస్‌ఐపై చర్యలకు కొత్తపేట వాసుల డిమాండ్‌
ఆందోళన చేస్తున్న కొత్తపేట గ్రామస్థులు

పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళన 

గుడ్లూరు, మే 10: అమాయకుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్న గుడ్లూరు ఏఎస్‌ఐ మురళీ ధర్‌ రావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం పోలీసు స్టేషన్‌ ఎదుట కొత్త పేట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు పోలీస్టేషన్‌లో కొత్తపేటకు చెందిన బాధితుడు శ్రీనయ్య పోలీసులకు ఇచ్చిన ఫి ర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఇటీవల కొత్తపేటకు చెందిన బంకా శీన య్యకు అదే గ్రామానికి చెందిన గంగయ్య, హరికృష్ణ, శ్రీనివాసులు, నారాయణల మధ్య వివాదం నెలకొంది. ఇదికాస్త కొట్లాటకు దారి తీసింది. దీంతో బాధితుడు శ్రీనయ్య తలకి గాయాలవడంతో కందుకూరు ఏరియా వైద్య శాలలో చికిత్స పొంది గుడ్లూరు పోలీ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందిం చిన పోలీసులు శ్రీనయ్యను ఈనెల 8 తేది సాయంత్రం స్టేషన్‌కు  పిలిపించి ఫిర్యా దును ఉపసంహరించుకునేలా చేశారని ఆ రోపించాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనయ్య తన స్నేహితుడుకి పోన్‌ చేసి నేను చనిపోతున్నానని చెప్పి, 8వ తేదీ నుంచి కనిపించకుండాపోయాడు. దీంతో శ్రీనయ్య తల్లిదండ్రులు బంకా వెంకటసుబ్బారావు, ఆదెమ్మలు గ్రామస్థులతో స్టేషన్‌ ఎదుట ఆం దోళనకు దిగారు. తమకు న్యాయం చేయా లని కోరారు. సోమవారం కందుకూరు డీఎ స్పీ, సీఐలకు కూడా ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-05-11T07:21:07+05:30 IST