ఫిట్‌నెస్‌ యాప్‌లకు డిమాండ్‌

ABN , First Publish Date - 2021-05-01T05:30:00+05:30 IST

కొవిడ్‌ రెండో వేవ్‌తో ప్రజలంతా బెంబేలెత్తుతున్నారు. అందరూ ఆహారం, ఫిట్‌నెస్‌లపై దృష్టిపెడుతున్నారు. జిమ్‌లకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఫిట్‌నెస్‌ యాప్‌లపై

ఫిట్‌నెస్‌ యాప్‌లకు డిమాండ్‌

కొవిడ్‌  రెండో వేవ్‌తో ప్రజలంతా బెంబేలెత్తుతున్నారు. అందరూ ఆహారం, ఫిట్‌నెస్‌లపై దృష్టిపెడుతున్నారు. జిమ్‌లకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఫిట్‌నెస్‌ యాప్‌లపై దృష్టిసారిస్తున్నారు. గడచిన రెండు నెలల్లో వీటి డౌన్‌లోడింగ్‌ ఇరవై శాతం మేర పెరిగిందట. ఫిబ్రవరి మధ్య నాటికి 50 శాతం పెరుగుదల ఉన్నట్టు కొందరి పరిశీలనలో వెల్లడైంది. చాలా రాష్ట్రాల్లో ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునే వెసులుబాటు కల్పించారు. కర్ఫ్యూ,  కుటుంబాలు వేటికవి ఐసోలేషన్‌ ఫలితంగా శారీరక, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ సారించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. డేటా అనలిస్టిక్‌ కంపెనీ ‘యాప్‌ అన్నీ’ నివేదిక ప్రకారం ఒక్క మార్చిలోనే ఈ తరహా యాప్స్‌ డౌన్‌లోడ్‌ 20 శాతం అధికంగా నమోదైంది. ఐఓఎస్‌, గూగుల్‌ ప్లే నుంచి హెల్త్‌, ఫిట్‌నెస్‌ యాప్‌ల డౌన్‌లోడ్‌ పెరిగింది.


ఈ రకం యాప్స్‌ డౌన్‌లోడింగ్‌లో ‘ఆరోగ్య సేతు’ ఎప్పటి మాదిరిగా ప్రథమ స్థానంలో ఉంది. తదుపరి స్థానంలో ‘కొవిన్‌’ ఉంది. కొవిడ్‌ కేసులు మూడు లక్షల మార్కును అధిగమించడంతో హెల్త్‌ మానిటరింగ్‌ కంపెనీలు ఆన్‌లైన్‌ సేవల విస్తృతిని పెంచాయి. వైద్యపరంగా సలహాలు, స్లీప్‌ మానిటరింగ్‌, మెడిటేషన్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. హెల్త్‌పైస్టూడియో, గ్రోఫిట్టర్‌ వంటివి కూడా ఈ మూడు నాలుగు వారాల్లోనే ఫిట్‌నెస్‌ యాప్‌ల డౌన్‌లోడింగ్‌లో ఎదుగుదలను గుర్తించాయి. 

Updated Date - 2021-05-01T05:30:00+05:30 IST