జీతాలు చెల్లించాలని డిమాండ్‌

ABN , First Publish Date - 2020-12-04T04:57:24+05:30 IST

నగరపాలక సంస్థ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు ఐదు నెలలుగా బకాయి పడిన హెల్త్‌ అలెవెన్సులు, జీతాలు తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ, సీఐటీయూ ప్రతినిధులు కృష్ణంరాజు, జగన్మోహన్‌రావు, రంగరాజు డిమాండ్‌ చేశారు.

జీతాలు చెల్లించాలని డిమాండ్‌
బొబ్బిలి: ధర్నా చేస్తున్న కార్మికులు

విజయనగరం దాసన్నపేట, డిసెంబరు 3:  నగరపాలక సంస్థ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు ఐదు నెలలుగా బకాయి పడిన హెల్త్‌ అలెవెన్సులు, జీతాలు తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ, సీఐటీయూ ప్రతినిధులు కృష్ణంరాజు, జగన్మోహన్‌రావు, రంగరాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం జేసీ మహేష్‌కుమార్‌ని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి  జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.12 వేల జీతంతో పాటు హెల్త్‌ అలవెన్సు రూ.6 వేలు ఇస్తామని ప్రకటించారన్నారు. ఈ మేరకు ఐదు నెలలుగా బకాయి పడిన మొత్తాలను చెల్లించాలన్నారు. జేసీని కలిసిన వారిలో భాస్కర్‌, చిరంజీవి తదితరులు ఉన్నారు.  బొబ్బిలి:  కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మునిసిపల్‌ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న మెడికల్‌ అలవెన్స్‌ బకాయిలు చెల్లించాలని, కార్మికుల విశ్రాంతి భవనానికి స్థలాన్ని కేటాయిం చాలని కోరారు.  ఫేస్‌ రీడింగ్‌ ప్రక్రియను నిలుపుదల చేయాలని, ఇంటింటి చెత్త సేకరణకు అవసరమైన సామగ్రి సమకూర్చాలని డిమాండ్‌ చేస్తూ మునిసిపల్‌ అధికారులకు మెమోరాండం అందజేశారు.  ఈ ధర్నాలో శంకరరావు, కనకరాజు, గౌరి తదితరులు పాల్గొన్నారు. 

  

 

Updated Date - 2020-12-04T04:57:24+05:30 IST