నిర్మాణంలో ఉన్న ఆర్‌బీకే భవనం ధ్వంసం

Published: Mon, 16 May 2022 00:45:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నిర్మాణంలో ఉన్న ఆర్‌బీకే భవనం ధ్వంసం బైలపూడిలో ధ్వంసం చేసిన నిర్మాణంలో ఉన్న ఆర్‌బీకే భవనం

  బైలపూడికి చెందిన ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు

 వ్యక్తిగత కక్షతోనే చేశారని విలేఖర్లకు వివరించిన కాంట్రాక్టర్‌  

చీడికాడ, మే 15 : మండలంలోని బైలపూడిలో నిర్మాణంలో ఉన్న రైతు భరోసా కేంద్ర భవనాన్ని గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ధ్వంసం చేసినట్టు సదరు కాంట్రాక్టర్‌ ఈశ్వరరావు ఆరోపించారు. ఆదివారం సాయంత్రం ఆయన ఇక్కడి విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం రూ.21 లక్షలు మంజూరు చేయడంతో ఈ భవన నిర్మాణాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. శుక్రవారం అర్ధరాత్రి తరువాత తనపై ఉన్న వ్యక్తిగత కక్షతో గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గోడలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో పాటు శనివారం రాత్రి చీడికాడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఈ అంశంపై పోలీసులను వివరణ కోరగా, కాంట్రాక్టర్‌ నుంచి ఫిర్యాదు అందినట్టు చెప్పారు. విచారణ జరిపి తగిన చర్యలు చేపడతామన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.