గీతం’లో కూల్చివేతలు

ABN , First Publish Date - 2020-10-25T08:06:41+05:30 IST

విశాఖపట్నం గీతం విశ్వవిద్యాలయంలోని పలు నిర్మాణాలను రెవె న్యూ, గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీవీఎంసీ) అధికారులు శనివారం

గీతం’లో కూల్చివేతలు

ప్రభుత్వ భూముల్లో కట్టారంటూ

అర్ధరాత్రి దాటాక తొలగింపు

బీచ్‌రోడ్‌ మూసి బందోబస్తు మధ్య 

9 గంటలపాటు సాగిన ఆపరేషన్‌

నోటీసు ఇవ్వకుండా కూల్చివేతలా?

సర్కార్‌ తీరుపై నిర్వాహకుల ఆవేదన

రేపటిదాకా ఆపండి: హైకోర్టు

ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలంటూ.. 


విశాఖపట్నం/ఎండాడ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం గీతం విశ్వవిద్యాలయంలోని పలు నిర్మాణాలను రెవె న్యూ, గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీవీఎంసీ) అధికారులు శనివారం తెల్లవారుజామున కూల్చివేశారు. ప్రభుత్వ భూమి ఉన్నదంటూ ఎక్స్‌కవేటర్‌లతో పలు కట్టడాలను తొలగించారు. గీతం ప్రధాన ప్రవేశ ద్వారం, ప్రహరీని కూల్చివేశా రు. గీతం మెడికల్‌ కళాశాల వెనుక ప్రహరీని పడగొట్టారు. క్రీ డా మైదానాన్ని అడ్డంగా ఎక్స్‌కవేటర్‌తో తవ్వేసి రెండుగా విభజించారు. ప్రాంగణంలోని గాంధీ విగ్రహం, వ్యవస్థాపకులు ఎంవీవీఎస్‌ మూర్తి విగ్రహానికి ఎదురుగా స్తంభాలు పాతి, కం చె ఏర్పాటుచేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి అం టూ హెచ్చరిక బోర్డులు పెట్టారు. అర్ధరాత్రి దాటాక ప్రారంభమైన ఈ ఆపరేషన్‌ శనివారం ఉదయం 11 వరకు కొనసాగిం ది. ఆ సమయంలో గీతం పరిసరాల్లో భారీఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. అక్రమాల సమాచారం నిర్వాహకులకు ఉందని అధికారులు చెబుతుంటే, కనీసం చెప్పకుండా కూల్చివేతలకు పాల్పడ్డారని గీతం యాజమాన్యం ఆరోపించిం ది. ఈ వివరాల్లోకి వెళితే, శుక్రవారం అర్ధరాత్రి దాటాక రుషికొండలో గల గీతం విద్యా సంస్థల వద్ద పోలీస్‌ బలగాలను మోహరించారు.తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఎక్స్‌కవేటర్లు రాగా, 3 గంటలకు రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు చేరుకున్నారు. అటు రుషికొండ, ఇటు బీచ్‌ రోడ్డు ఇరువైపులా ట్రాఫిక్‌ను నిలిపివేశారు.


ఉదయం4 గంటల సమయంలో గీతం విశ్వవిద్యాలయం, గీతం మెడికల్‌ కళాశాల ప్రాంగణా ల్లో కట్టడాలను కూలగొట్టడం ప్రారంభించారు. విషయం తెలుసుకుని గీతం సిబ్బంది...అక్కడకు పరుగు పరుగున వచ్చారు. నోటీసులు ఇవ్వకుండా చీకటిలో నిర్మాణాల కూల్చివేత ఏమిటంటూ...అధికారులను ప్రశ్నించారు. అధికారులు వారి వాదనను తోసిపుచ్చారు. ఐదు నెలల క్రితమే సర్వే చేశామని, ఆక్రమణలపై యాజమాన్యానికి సమాచారం ఉందని పేర్కొన్నారు. 


40.51 ఎకరాల ప్రభుత్వ భూమి: అధికారులు

సర్వేయర్ల నివేదిక ప్రకారం రుషికొండ, ఎండాడ గ్రామాల్లో 40.51 ఎకరాల భూమి గీతం ఆధీనంలో ఉందని ఆర్‌డీవో పెంచల కిశోర్‌ తెలిపారు. ‘‘ఎండాడ రెవెన్యూ సర్వే నంబర్లు 15, 16, 17, 18, 19, 20 పార్ట్‌లలో 22.21 ఎకరాలు, రుషికొండ సర్వే నంబర్లు 34, 35, 37, 38, 55, 61 పార్టులలో 18.3 ఎకరాలు ఉంది. ఆ భూముల్లో గీతం ప్రహరీ, విశ్వవిద్యాలయం గార్డెన్‌, క్రీడా మైదానం ఉన్నాయి. సుమారుగా ఎకరా నుంచి రెండు ఎకరాలలో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం ప్రహరీలు మాత్రమే కూల్చివేశాం. నోటీసు ఏమీ ఇవ్వలేదు కానీ.. ఆక్రమణలు తొలగిస్తామని మాత్రం గీతం యాజమాన్యానికి ముందుగా చెప్పాం’’ అని వివరించారు. 


కూల్చివేతలు ఆపండి

గీతం వర్సిటీ వ్యవహారంలో హైకోర్టు ఆదేశం

సోమవారం వరకు తదుపరి చర్యల నిలిపివేత

నేడు పూర్తిస్థాయిలో విచారణ


అమరావతి, అక్టోబరు24(ఆంధ్రజ్యోతి): విశాఖలోని గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేత వ్యవహారంలో తదుపరి చర్యలను సోమవారం వరకు నిలుపుదల చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ ఆదివారం చేపడతామని తెలిపిం ది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కనీ సం ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా అధికారులు అక్రమంగా వర్సిటీ కట్టడాలను కూల్చివేస్తున్నారని, నిర్మాణాల క్రమబద్ధీకరణ ప్రక్రియ పెండింగ్‌లో ఉండగా హ ఠాత్తుగా కూల్చివేతలకు దిగారంటూ వర్సిటీ యాజమాన్యం హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 


నోటీసు ఇవ్వలేదు : గీతం యాజమాన్యం

గీతం విశ్వవిద్యాలయంపై ఇలాంటి దాడి చేయడం చాలా దారుణమని ఆ సంస్థ పీఆర్‌వో నరసింహం ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మాకు ఎటువంటి నోటీసు లేకుండా, గీతం ఉన్నతాధికారులు నగరంలో లేని సమయంలో...ఇలా చీకటి సమయాన వచ్చి కూల్చివేయడం అన్యాయం. ఇది హృదయ విదారకం. వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. కొవిడ్‌లో వేలాది మందికి చికిత్స చేసిన ఘనత గీతంకు ఉంది. మూడు వేల మంది గర్భిణులకు వైద్య సేవలు అందించాం. హుద్‌హుద్‌ సమయంలో ఇక్కడే షెల్డర్‌ ఇచ్చి మూడు రోజులు అందరికీ భోజనాలు పెట్టాం. విశాఖపట్నం అంటే గీతం...గీతం అంటే విశాఖపట్నం అనే పేరు ఉంది. ఇలా చేసి ఉండకూడదు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-10-25T08:06:41+05:30 IST