డెంగ్యూ డేంజర్‌ బెల్స్‌

ABN , First Publish Date - 2022-08-19T07:17:05+05:30 IST

పెద్దాపురం పట్టణంలో డెంగ్యూ కోరలు చాస్తోంది. రోజురోజుకూ చాపకింద నీరులా డెంగ్యూ కేసులు పెరగుతున్నాయి. దీంతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నెలరోజుల వ్యవధిలో ముగ్గురు చిన్నారులు డెంగ్యూతో మృతి చెందడంతో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. పెద్దాపురం ఏరియా ఆస్పత్రికి గడచిన రెండురోజుల వ్యవధిలో 15 డెంగ్యూ అనుమానిత కేసులు రావడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు.

డెంగ్యూ డేంజర్‌ బెల్స్‌

  • పట్టణంలో పెరుగుతున్న డెంగ్యూ అనుమానిత కేసులు
  • నెల వ్యవధిలో ముగ్గురు చిన్నారులు మృతి
  • కొత్తగా మళ్లీ మరో 15 కేసులు నమోదు
  • పారిశుద్య నిర్వహణ చర్యలు చేపట్టడంలో మున్సిపల్‌ అధికారులు విఫలం  
  • ఆందోళనలో చెందుతున్న ప్రజలు

పెద్దాపురం, ఆగస్టు 18: పెద్దాపురం పట్టణంలో డెంగ్యూ కోరలు చాస్తోంది. రోజురోజుకూ చాపకింద నీరులా డెంగ్యూ కేసులు పెరగుతున్నాయి. దీంతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నెలరోజుల వ్యవధిలో ముగ్గురు చిన్నారులు డెంగ్యూతో మృతి చెందడంతో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. పెద్దాపురం ఏరియా ఆస్పత్రికి గడచిన రెండురోజుల వ్యవధిలో 15 డెంగ్యూ అనుమానిత కేసులు రావడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. పాత పెద్దాపురంలో డెంగ్యూ కేసుల అధికంగా నమోదు అవుతుండడంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే సాధారణ జ్వరాలు, మలేరియా కేసులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతన్నాయి. డెంగ్యూ బారిన పడిన మరో ఐదుగురుని కాకినాడ జీజీహెచ్‌కు మెరుగైన చికిత్స కోసం తరలించారు. పెద్దాపురం పట్టణంతోపాటు పరిసర గ్రామాలైన కట్టమూరు, పులిమేరు, కొండపల్లి, చినబ్రహ్మదేవం తదితర గ్రామాల్లో డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా డెంగ్యూ ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం, పట్టణ, రూరల్‌ గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో ఇటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డెంగ్యూ లక్షణాలతో చిన్నారి మృతి

పెద్దాపురం, ఆగస్టు 18: డెంగ్యూ లక్షణాలతో ఒక చిన్నారి గురువారం మృతి చెందింది. పాతపెద్దాపురానికి చెందిన సంజన(10) అనే చిన్నారి డెంగ్యూలక్షణాలతో తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ నెలలో వరహాలయ్యపేటకు చెందిన ఓ చిన్నారి కొత్తపేటకు చెందిన ఓ బాలుడు డెంగ్యూ లక్షణాలతో మృతి చెందారు. దీంతో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.

Updated Date - 2022-08-19T07:17:05+05:30 IST