పరిసరాల శుభ్రతతో డెంగీ దూరం

ABN , First Publish Date - 2022-05-17T05:43:02+05:30 IST

జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు.

పరిసరాల శుభ్రతతో డెంగీ దూరం
సిద్దిపేటలో డెంగీ అవగాహన ర్యాలీలో పాల్గొన్న జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ

జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. జిల్లాస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైద్య ఆరోగ్య సిబ్బంది ర్యాలీలో పాల్గొని ప్రజలకు డెంగీ వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డెంగీ వ్యాధితో భయపడాల్సిన పని లేదని, జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని వివరించారు. 

 సిద్దిపేట టౌన్‌, మే 16: ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని, దోమల వృద్ధిని నివారిస్తే డెంగీ వ్యాధిని అరికట్టవచ్చని సిద్దిపేట జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు. సోమవారం సిద్దిపేటలో జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. రాష్ట్ర మలేరియా, పైలేరియా అదనపు డైరెక్టర్‌ డాక్టర్‌ అమర్‌సింగ్‌నాయక్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సు, డీఎంఆండ్‌హెచ్‌వో కాశీనాథ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నాయకం లక్ష్మణ్‌, మంత్రి ఓఎ్‌సడీ బాలరాజు, వైద్య సిబ్బంది శ్రీనివాస్‌, డాక్టర్‌ వినోద్‌ బాబ్జి, డాక్టర్‌ రజిని, కొండయ్య, పర్యవేక్షకులు కాల్వ చక్రధర్‌, కొండయ్య, ఏసుమేరీ, ఎస్‌వో శ్రీనివాస్‌, డాక్టర్‌ శ్రీదేవి, డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటేష్‌, సైదులు, జాకీర్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.


సంగారెడ్డిలో

సంగారెడ్డి అర్బన్‌, మే 16: పరిశుభ్రతను పాటిస్తూ దోమలవ్యాప్తిని అరికట్టడం ద్వారా  డెంగీ వ్యాధి నివారణ సాధ్యమని  జిల్లా ఎస్పీ రమణకుమార్‌ పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డిలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కారక్రమంలో అదనపు కలెక్టర్‌ రాజర్షిషా, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ గాయత్రీదేవీ పాల్గొన్నారు.


రామాయంపేటలో

రామాయంపేట, మే 16: మెదక్‌ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు, మలేరియా జోనల్‌ అధికారి సునీల్‌ ఆధ్వర్యంలో రామాయంపేటలో అవగాహన ర్యాలీ తీశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి ఎలిజబెత్‌, ఆరోగ్య విస్తీర్ణాధికారి కరిపె రవీందర్‌, నాగయ్య, సత్తమ్మ, సునంద పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-17T05:43:02+05:30 IST