ఆగని మరణాలు

ABN , First Publish Date - 2021-10-10T06:47:29+05:30 IST

కూనవరం మండలం పోచవరం కాలనీ పంచాయతీలో మరణ మృదంగం వినిపిస్తోంది. డెంగ్యూ జ్వరాలు, సాధారణ జ్వరాలతోపాటు ఇతర కారణాలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు.

ఆగని మరణాలు

 పోచవరం కాలనీ పంచాయతీలో మరణమృదంగం

 డెంగ్యూతో శనివారం యువకుడు మృతి 

 ఇప్పటివరకు 16కు చేరిన మృతుల సంఖ్య

 భద్రాచలం ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగ్యూతో     

చికిత్స పొందుతున్న మరో 8 మంది

 పోలిపాక గ్రామంలోనే ఏకంగా 9 మంది మృతి

కూనవరం, అక్టోబరు 9 : కూనవరం మండలం పోచవరం కాలనీ పంచాయతీలో మరణ మృదంగం వినిపిస్తోంది. డెంగ్యూ జ్వరాలు, సాధారణ జ్వరాలతోపాటు ఇతర కారణాలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ పంచాయతీలోని పోచవరం కాలనీ పోలిపాక, గుండువారిగూడెం గ్రామాల్లో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. శనివారం పోలిపాక గ్రామానికి చెందిన పల్లంటి గోపి (19) అనే యువకుడు డెంగ్యూతో మృతి చెందాడు. దీంతో ఈ పంచాయతీలో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. ఒక పోలిపాక గ్రామంలోనే 9 మంది మృతి చెం దారు. ఇప్పటివరకు మృతిచెందిన వారిలో డేగల వీరాస్వామి, పెదమథ్యం, అశోక్‌, కుచ్చలపాటి ముత్యం, డేగల మోహన్‌రావు, డేగల వెంకట్రావ్‌, పల్లంటి గోపి, గంగయ్య, ఎడవల్లి రాంబాబు, పల్లంటి సంజీవరావు, పల్లంటి భాస్కర్‌రావు, గడసరి సూరి, మడకం అచ్చమ్మ, ఎస్‌ జాన్‌రాజు తదితరులు మృతిచెందిన వారిలో ఉన్నారు. వీరి లో ఎక్కువ మంది డెంగ్యూ, సాధారణ జ్వరాలతో మృతి చెందినవారే. ఒకవైపు ప్రజలు చనిపోతూ ఉంటే వైద్య సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆ పంచాయతీ ప్రజలు అంటున్నారు. గత నెలలో ఈ గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని చింతూరు ఐటీడీఏ పీవో మీడియా ద్వారా హామీ ఇచ్చారని, కానీ ఇప్పటివరకు ఎటు వంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయలేదని ఆ పంచాయతీ ఉపసర్పంచ్‌ సునీల్‌ తెలిపారు. ఈ పంచాయతీలోని మర ణాలపై గత నెల 15న ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని అందించింది. అప్పటిక ప్పుడు అధికారులు సర్వే చేశారుకాని వైద్య శిబి రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగింది. మరోవైపు డెంగ్యూ జ్వరాలతో మరో ఎనిమిది మంది భద్రాచలం ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో బరపాటి శ్రీను, ఎమ్‌ అరుణ్‌కుమార్‌, బడుగుల శ్రీనివాస, కోడి శివ, బొమ్మా సారిక, ఎస్‌కె నభి, మనోహరమ్‌, వజ్రమ్మ, ఉన్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

మరణాలకు అధికారులే బాధ్యత వహించాలి..

పోచవరం కాలనీలో జరిగే మరణాలకు అధికారులే బాధ్యత వహిం చాలని మాజీ జడ్పీటీసీ ఎడవల్లి కన్యకాపరమేశ్వరి, మాజీ ఎంపీపీ పొడియం అప్పారావు, పంచాయతీ ఉపసర్పంచ్‌ సునీల్‌ అన్నారు. ఇక్క డ ప్రజలు డెంగ్యూ బారినపడి చనిపోతుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ మరణాలపై మొదటిసారిగా ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చిందని, అప్పటికప్పుడు హడావుడి సర్వే చేసి తర్వాత పట్టించుకోవడం లేదన్నారు. ఇంత జరుగుతుంటే అడిష నల్‌ డీఎంఅండ్‌హెచ్‌వో, వైద్యులు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. ఇక్కడ సమర్థవంతమైన వైద్యాధికారిని నియమించాలని కోరారు. మర ణాలపై ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు అందిస్తున్నారని, దీని పై ఐటీడీఏ పీవోకు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.


Updated Date - 2021-10-10T06:47:29+05:30 IST