తగ్గని డెంగ్యూ వ్యాప్తి

ABN , First Publish Date - 2021-12-24T04:47:04+05:30 IST

మండలంలో డెంగ్యూ వ్యాధి రోజురోజుకు వ్యాప్తి చెందుతూ ఉంది.

తగ్గని డెంగ్యూ వ్యాప్తి
సోమరాజుపల్లెలో జరిగిన వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులు

అందుబాటులో లేని వైద్యాధికారులు

ఇప్పటికే ఇందుకూరుపేటలో ఒకరు, కొత్తూరులో ఒకరు మృతి

 

ఇందుకూరుపేట, డిసెంబరు 23 : మండలంలో  డెంగ్యూ వ్యాధి రోజురోజుకు వ్యాప్తి చెందుతూ ఉంది. పది రోజుల నుంచి డెంగ్యూ బారినపడిన బాధితులు ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో కొత్తూరు, ఇందుకూరుపేట గ్రామాలే కాక సోమరాజుపల్లె, నరసాపురం, గంగపట్నం అనేక గ్రామాల్లో బాధితులు కనిపిస్తున్నారు. ఇప్పటికే ఇందుకూరుపేటలో ఒకరు, కొత్తూరులో ఒకరు మృతి చెందడంతో మండలంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ  వైద్యాఽధికారులు అందుబాటులో లేకపోవడంతో చర్యలు ఏమి చేపట్టలేకపోతున్నారు. ఇందుకూరుపేట ప్రధాన వైద్యుడు రెండుచోట్ల పనిచేస్తుండడంతో వీరు వారానికి రెండు రోజులు మాత్రమే మండలానికి వస్తుండడం కూడా ఒక లోపంగా ప్రజలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 60 మందికి పైగా బాధితులు నెల్లూరులోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. కాగా బుధవారం జిల్లా అధికారులు మండలంలో డెంగ్యూ పరిస్థితిపై విచారించి వెళ్లారు. అలాగే గురువారం మైపాడు డాక్టర్‌ సంధ్య ఆధ్వర్యంలో సోమరాజుపల్లిలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కాగా పారిశుధ్యం లోపం ప్రధానంగా ఉందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, వైద్యులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2021-12-24T04:47:04+05:30 IST