కరోనా టీకా 2వ డోసు తీసుకున్న నాలుగున్నర నెలలకు బూస్టర్ డోస్: డెన్మార్క్

ABN , First Publish Date - 2021-12-13T23:57:06+05:30 IST

కరోనా టీకా రెండో డోసు తీసుకున్న నాలుగున్నర నెలల తరువాత బూస్టర్ డోసు ఇవ్వాలని డెన్మార్క్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఒమైక్రాన్ ముప్పు పోంచి ఉన్న నేపథ్యంలో అక్కడి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా టీకా 2వ డోసు తీసుకున్న నాలుగున్నర నెలలకు బూస్టర్ డోస్: డెన్మార్క్

కోపెన్‌హేగన్: కరోనా టీకా రెండో డోసు తీసుకున్న నాలుగున్నర నెలల తరువాత బూస్టర్ డోసు ఇవ్వాలని డెన్మార్క్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఒమైక్రాన్ ముప్పు పోంచి ఉన్న నేపథ్యంలో అక్కడి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో రెండో డోసు తీసుకున్న ఆరున్నర నెలలకు బూస్టర్ డోసు ఇవ్వాలని నిర్ణయించగా..ప్రస్తుతం ఈ నిడివిని నాలుగున్నర నెలలకు కుదించింది. త్వరలో దీన్ని అమలు పరుస్తామని అక్కడి అధికారులు తెలిపారు. ‘‘టీకాల ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తి.. కొత్త వేరియంట్ విషయంలో కొంత బలహీనంగా ఉంది. అయితే.. మూడో డోసుతో ఇమ్యూనిటీ మరింత బలపడుతుందని గణాంకాలు సూచిస్తున్నాయి.’’ అని అక్కడి ఆరోగ్య శాఖ పేర్కొంది. 


తాజాగా లెక్కల ప్రకారం.. డెన్మార్క్‌లో దాదాపు 80 శాతం మంది జనాభా ఇప్పటికే పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అంతేకాకుండా.. జనాభాలో 20 శాతం మంది మూడో డోసు తీసుకున్నారు. మరోవైపు..  చాలా కాలం తరువాత డెన్మార్క్‌లో గతవారం రోజువారి కేసుల సంఖ్య పెరిగింది. కరోనా కారణంగా ఆదివారం అక్కడ తొమ్మిది మంది మరణించారు. దీంతో.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 3014కు చేరింది. కరోనాతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం బూస్టర్ డోసుకు రంగం సిద్ధం చేస్తోంది. 

Updated Date - 2021-12-13T23:57:06+05:30 IST