ఇన్‌స్పైర్‌ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకొండి

ABN , First Publish Date - 2021-07-23T06:25:26+05:30 IST

ఇన్‌స్పైర్‌ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకొండి

ఇన్‌స్పైర్‌ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకొండి

డీఈవో వాసంతి

వరంగల్‌ రూరల్‌ కలెక్టరేట్‌, జూలై 22: పాఠశాల స్థాయి నుంచే ప్రయోగాలను ప్రోత్సహించేందుకు ఇవ్వనున్న ఇన్‌స్పైర్‌ మనాక్‌ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి డి.వాసంతి తెలిపారు. ప్రధానమంత్రి కలల ప్రాజెక్టు స్టార్టప్‌ ఇండియా దిశగా విద్యార్థులను నడిపించేందుకు 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఈ అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. 6 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ ఎయిడెడ్‌, ప్రైవేటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇతర పాఠశాలలు, కేంద్రీయ పాఠశాలల్లో చదువుతున్న 10 నుంచి 15 సంవత్సరాలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. దేశ వ్యాప్తంగా 5 లక్షల పాఠశాలల నుంచి 10 లక్షల ప్రాజెక్టులు తయారవుతున్నాయనే అంచనా ఉండగా ఇందులో నుంచి లక్ష ప్రాజెక్టులను ఎంపిక చేసి విద్యార్థులకు రూ.10వేల చొప్పున అందిస్తారని తెలిపారు. అక్టోబరు 15వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకోని పాఠశాలలు వన్‌టైం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి శ్రీనివాస్‌(9848878455)ను సంప్రదించాలని డీఈవో వాసంతి కోరారు.

Updated Date - 2021-07-23T06:25:26+05:30 IST