Advertisement

డీఈఓను సస్పెండ్‌ చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ

Apr 22 2021 @ 23:30PM
పోరుమామిళ్లలో నిరసన తెలుపుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నేతలు

పోరుమామిళ్ల, ఏప్రిల్‌ 22: జిల్లాలో కార్పొరేట్‌ కొమ్ముకాస్తున్న డీఈఓ ను సస్పెండ్‌ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ వద్ద డీఈఓ ను సస్పెండ్‌ చేయాలని నిరసన తెలిపిన ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యాశాఖ ఆదేశాలు పాటించకుండా తరగతులు నిర్వహిస్తు న్న ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలకు డీఈఓ కొమ్ము కాస్తున్నార న్నారు.

ఇందులో భాగంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో 1 నుంచి 9 వరకు పాఠశాలలు విద్యాశాఖ సెలవులు ప్రకటిస్తే జిల్లాలో కొన్ని పాఠశాలలు నడుపుతున్నారన్నారు. లెక్కచేయని వారిపై చర్య లు తీసుకోకుండా ఉన్నారన్నారు.  

మైదుకూరులో....

మైదుకూరు, ఏప్రిల్‌ 22: ప్రైవేట్‌ విద్యా  సంస్ధలకు కొమ్ముకాస్తున్న డీఈఓను సస్పెండ్‌ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి  సగిలి రాజ్రేంద ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ

జిల్లాలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో పాఠశాల లు మూత వేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జిల్లాలో అమలు చేయడం లేదని ఆరోపించారు. కార్పొరేట్‌ పాఠశాలలు తరగ తులు నిర్వహిస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవడంలో విఫల మయ్యారని వివరించారు. కార్యక్రమంలో నాయకులు మస్తాన్‌, సద్దాం, శ్రీనాద్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.