Kuwait: వాచ్‌ మెన్‌లకు వార్నింగ్.. వెంటనే అలా చేయకపోతే దేశ బహిష్కరణ!

ABN , First Publish Date - 2022-06-12T18:06:14+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ సర్కార్ Building watchmanల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

Kuwait: వాచ్‌ మెన్‌లకు వార్నింగ్.. వెంటనే అలా చేయకపోతే దేశ బహిష్కరణ!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ సర్కార్ Building watchmanల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వారు కాపాల ఉండే భవనంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగినప్పుడు ఆ విషయాన్ని వెంటనే అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులకు తెలియజేయాలని, లేనిపక్షంలో దేశం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఇటీవల గుట్టుచప్పుడు కాకుండా అల్ వఫ్రా, మీనా అబ్దుల్లా ప్రాంతాలతో పాటు అల్ ఫర్వానియా గవర్నరేట్ పరిధిలో స్థానికంగా రెండు పరిశ్రమలు ఏర్పాటు చేసి వాటిలో లోకల్ మద్యం తయారు చేయడం అధికారుల తనిఖీల్లో బయటపడింది. జనవాసాల మధ్య రెండు భవనాల్లో 328 మంది రెండు బృందాలుగా ఏర్పడి ఇలా మద్యం తయారు చేస్తున్నారు. దాంతో అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 


అయితే, ఈ రెండు భవనాలకు వాచ్‌మెన్‌గా పని చేస్తున్నవారు ఈ విషయమై అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ఘటన నేపథ్యంలోనే తాజాగా ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ.. బిల్డింగ్ వాచ్‌మెన్‌లా విషయమై కీలక ప్రకటన చేసింది. ఇకపై భవనాలకు కాపాల కాసేవారు అలర్ట్‌గా ఉండాలని, ఒకవేళ వారు విధులు నిర్వహించే భవనంలో ఏదైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపింది. లేనిపక్షంలో దేశ బహిష్కరణకు గురవుతారని మంత్రిత్వశాఖ అధికారులు హెచ్చరించారు. 

Updated Date - 2022-06-12T18:06:14+05:30 IST