భారీగా ట్రాఫిక్ చలాన్ల జమ
ABN , First Publish Date - 2022-03-22T15:32:31+05:30 IST
ప్రభుత్వ ఖజానాకు ట్రాఫిక్ చలాన్ల సొమ్ము భారీగా జమ అయింది.
హైదరాబాద్: ప్రభుత్వ ఖజానాకు ట్రాఫిక్ చలాన్ల సొమ్ము భారీగా జమ అయింది. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గ్రేటర్ పరిధిలో1.2 కోట్ల చలాన్లు క్లియర్ చేశారు. ప్రభుత్వ ఖజానాకు వాహనదారుల నుంచి రూ.112.98 కోట్ల ఫైన్ చెల్లించారు. హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు 63 లక్షల చలాన్లు క్లియర్ చేశారు. చలాన్ల రూపంలో రూ. 49.6 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చింది. రాచకొండలో 16 లక్షల చలాన్లు క్లియర్, రూ.15.3 కోట్లను వాహనదారులు చెల్లించారు. సైబరాబాద్లో 38 లక్షల చలాన్లు క్లియర్, రూ.45.8 కోట్ల ఫైన్ని వాహనదారులు చెల్లించారు.