సర్పంచ్‌ భర్తపై ఉప సర్పంచ్‌ ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-04-18T05:34:31+05:30 IST

మండలంలోని గోపాల్‌పేట గ్రామ పంచా యతీ సర్పంచ్‌ భర్తపై ఉప సర్పంచ్‌ దుర్గేష్‌ శనివారం ఎంపీడీవో రఘుకు, ఎంపీవో శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు.

సర్పంచ్‌ భర్తపై ఉప సర్పంచ్‌ ఫిర్యాదు

నాగిరెడ్డిపేట, ఏప్రిల్‌ 17: మండలంలోని గోపాల్‌పేట గ్రామ పంచా యతీ సర్పంచ్‌ భర్తపై ఉప సర్పంచ్‌ దుర్గేష్‌ శనివారం ఎంపీడీవో రఘుకు, ఎంపీవో శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ వంజరి సునీత భర్త కిరణ్‌ అన్ని తానై వ్యవహరిస్తున్నారని, గ్రామ పంచాయతీ అభివద్ధి పనుల విషయంలో తనకు ఎలాంటి స మాచారం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించా లని, తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఉప సర్పంచ్‌ వెంట మండల కోఆప్షన్‌ సభ్యుడు ఎండి షాహెబ్‌ పాషా ఉన్నారు. 

Updated Date - 2021-04-18T05:34:31+05:30 IST