డేరా బాబాకు నెలరోజుల పెరోల్

ABN , First Publish Date - 2022-06-17T22:55:49+05:30 IST

ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో దోషిగా 20 ఏళ్ల జైలు శిక్ష పడిన డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ..

డేరా బాబాకు నెలరోజుల పెరోల్

చండీగఢ్: ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో దోషిగా 20 ఏళ్ల జైలు శిక్ష పడిన డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు నెలరోజుల పెరోల్‌ లభించింది. దీంతో ఆయన శుక్రవారంనాడు హర్యానాలోని రోహ్‌తక్ జైలు నుంచి విడుదలయ్యారు. డేరాబాబాకు సంబంధిత అధికారుల సిఫారసుతో రోహ్‌తక్ డివిజనల్ కమిషనర్ 30 రోజుల రిమాండ్‌ మంజూరు చేసినట్టు హర్యానా జైళ్ల శాఖ మంత్రి రంజిత్ చౌతాలా తెలిపారు. ఉత్తరప్రదేశ్ భాగ్‌పట్‌లోని బర్నావాలో ఉన్న డేరా సచ్చా సౌదా ఆశ్రమానికి డేరాబాబా వెళ్లాలనుకుంటున్నారని చెప్పారు.


డేరా ప్రధాన కార్యాలయమైన సిర్సాలో ఇద్దరు మహిళా భక్తులపై హత్యాచారానికి పాల్పడిన కేసులో ఆయనకు గతంలో 20 ఏళ్లు జైలు శిక్ష పడింది. 2017 ఆగస్టులో పంచకులలోని సిబీఐ ప్రత్యేక కోర్టు ఆయనను దోషిగా నిర్దారించింది. కాగా, గత ఫిబ్రవరిలో పంజాబ్ ఎన్నికలకు కాస్త ముందుగానే 21 రోజుల పెరోల్‌పై డేరాబాబా విడుదలయ్యారు. అయితే, పంజాబ్ ఎన్నికలకు, ఆయన విడుదలకు సంబంధమేమీ లేదని అప్పట్లో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తార్ వివరణ ఇచ్చారు. డేరాబాబా పెరోల్‌ సమయంలో గురుగామ్‌లో తన కుటుంబ సభ్యులతో గడిపారు.

Updated Date - 2022-06-17T22:55:49+05:30 IST