ఆటుపోట్లలోనే!

Published: Mon, 28 Mar 2022 02:35:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon

మార్కెట్లు ఈ వారం కూడా ఆటుపోట్లలోనే సాగే అవకాశం ఉంది. మార్చి నెల డెరివేటివ్స్‌ ముగింపు, క్రూడాయిల్‌ ధరలు, సరఫరా అవాంతరాలు మార్కెట్‌ కదలికలపై ప్రభావం చూపించే వీలుంది. నిఫ్టీ స్వల్పకాలిక దిశను తీసుకునే ముందు కొంత ఆటుపోట్లను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ఈ వారం నిఫ్టీకి 17000-16900 వద్ద బలమైన మద్దతు స్థాయిలు ఉండే అవకాశం ఉంది. అప్‌ట్రెండ్‌లో సాగితే మాత్రం 17350-17450 వద్ద నిరోధ స్థాయిలు ఉండనున్నాయి. గత వారం ఐటీ, మెటల్‌, ఫార్మా స్టాక్స్‌ దన్నుతో మార్కెట్లు సానుకూల ధోరణిలో సాగాయి. ఈ వారం కూడా అదే ధోరణిలో సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


స్టాక్‌ రికమండేషన్స్‌ 

మైండ్‌ట్రీ: ఐటీ విభాగంలోని ఈ షేరు గత వారం సుదీర్ఘ కన్సాలిడేషన్‌ నుంచి బయటపడింది. 200 రోజుల ఎస్‌ఎంఏ వద్ద చాలా కాలం పాటు కొనసాగిన ఈ షేరు గత గురువారం ఎట్టకేలకు బ్రేకౌట్‌ సాధించింది. ఈ వారం వాల్యూమ్స్‌ మరింతగా పెరిగితే షేరు  దూకుడును కనబరిచే వీలుంది. గత శుక్రవారం రూ.4,281.35 వద్ద క్లోజైన ఈ షేరును రూ.4,450 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.4,120 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 


గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ : రియల్టీ విభాగంలోని ఈ షేరు కొంత కాలంగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇటీవలి గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 50 శాతానికి పైగా ఈ షేరు పతనమైంది.   డైలీ చార్టుల ప్రకారం చూస్తే ప్రస్తుతం ఈ షేరు యూ-టర్న్‌ తీసుకున్నట్లు కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.1,622.95 వద్ద క్లోజైన ఈ షేరును స్వల్పకాలానికి రూ.1,710 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,574 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 

సమీత్‌ చవాన్‌, చీఫ్‌ ఎనలిస్ట్‌,టెక్నికల్‌, 

డెరివేటివ్స్‌, ఏంజెల్‌ వన్‌ లిమిటెడ్‌ 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.