Viral video: `ఊ అంటావా.. ఊహూ అంటావా` అంటూ వేదిక మీదే చిందేసిన వధూవరులు..

ABN , First Publish Date - 2022-02-08T17:35:06+05:30 IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన `పుష్ప` దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించింది.

Viral video: `ఊ అంటావా.. ఊహూ అంటావా` అంటూ వేదిక మీదే చిందేసిన వధూవరులు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన `పుష్ప` దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమాలోని పాటలు, డైలాగ్‌లు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సమంత నర్తించిన `ఊ అంటావా మావా.. ఊహూ అంటావా` పాట తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియా జనాలను ఈ పాట ఓ ఊపు ఊపుతోంది. తాజాగా ఓ పెళ్లిలో వధూవరులిద్దరూ ఈ పాటకు డ్యాన్స్‌ చేశారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


రోనక్‌ షిండే, ప్రాచీ మోర్‌ అనే నూతన దంపతులు తమ పెళ్లి వేడుకలో `ఊ అంటావా మావా.. ఊహు అంటావా` అంటూ డ్యాన్స్‌ చేశారు. పెళ్లి దుస్తుల్లోనే ఎనర్జిటిక్‌గా స్టెప్పులు వేశారు. ఆ వీడియోలో చాలా మంది డ్యాన్స్ చేసినప్పటికీ.. పెళ్లి కూతురు ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేసింది. ఆమె డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు రెండు మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది.



Updated Date - 2022-02-08T17:35:06+05:30 IST