Mother: తల్లికి ప్రేమ చాలు.. ఇంకేం అక్కర్లేదు.. వైరల్ అవుతున్న లేఖ..

ABN , First Publish Date - 2022-07-09T23:49:36+05:30 IST

చదువు లేదా ఉద్యోగాలు కోసం నగరాలకు వెళ్లి అక్కడి హాస్టళ్లలో ఉండే వారికి ఎదురయ్యే ప్రధాన సమస్య ఆహారం.

Mother: తల్లికి ప్రేమ చాలు.. ఇంకేం అక్కర్లేదు.. వైరల్ అవుతున్న లేఖ..

చదువు లేదా ఉద్యోగాల కోసం నగరాలకు వెళ్లి అక్కడి హాస్టళ్లలో ఉండే వారికి ఎదురయ్యే ప్రధాన సమస్య ఆహారం. హాస్టల్ ఫుడ్ లేదా మెస్ భోజనం తినలేక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ష్రుబెర్రీ అనే యువతికి కూడా ఇదే సమస్య ఎదురైంది. ఆమె తన సమస్యను తన స్నేహితుడితో చెప్పుకుంది. కుటుంబంతో పాటు కలిసి ఉంటున్న ఆ స్నేహితుడు తన తల్లికి ఆ విషయం చెప్పాడు. దీంతో ఆమె తన కొడుకుతో పాటు అతడి స్నేహితురాలికి కూడా ప్రతిరోజూ టిఫిన్ బాక్స్ పంపించేది.


ఇది కూడా చదవండి..

Uttar pradesh: ఛీ..ఛీ.. వీడసలు భర్తేనా.. స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం.. కారణమేంటో తెలిస్తే..


ప్రతిరోజూ అలా టిఫిన్ బాక్స్ తీసుకోవడం ష్రుబెర్రీకి నచ్చలేదు. `తిరిగి నేను ఏమీ ఇవ్వలేకపోతున్నాను.. దయచేసి ఇక పంపవద్ద`ని ష్రుబెర్రీ తన స్నేహితుడికి చెప్పింది. దీంతో అతడి తల్లి ఓ లెటర్‌ను రాసి ష్రుబెర్రీకి పంపించింది. `ఏం ఇబ్బంది పడకుండా ఆహారం తీసుకో. తల్లికి ఖాళీ టిఫిన్ బాక్సు పంపించడం గురించి పిల్లలు బాధపడకూడదు. నీ ప్రేమను, ఆప్యాయతను పంపిస్తే చాలు. అంతకంటే ఇంకేం వద్దు. గాడ్ బ్లెస్ యూ. లవ్యూ, మామ్` అని ఆ లేఖలో రాసింది. 


ఆ లేఖను ఆ యువతి ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఆ తల్లి ప్రేమపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. `ఇలాంటి వారి అవసరం ఈ ప్రపంచానికి చాలా ఉంది`, `ఆమె లాంటి వారిని ఎప్పటికీ కాపాడుకోవాలి`, `నాకు కన్నీళ్లు వస్తున్నాయి` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-07-09T23:49:36+05:30 IST