మేకపోతులు - నక్క

ABN , First Publish Date - 2020-12-21T05:30:00+05:30 IST

ఒకరోజు అడవిలో మేత కోసం వచ్చిన రెండు మేకపోతుల మధ్య గొడవ మొదలయింది. కాసేపట్లోనే వాటి మధ్య పోరు బాగా ముదిరింది...

మేకపోతులు - నక్క

ఒకరోజు అడవిలో మేత కోసం వచ్చిన రెండు మేకపోతుల మధ్య గొడవ మొదలయింది. కాసేపట్లోనే వాటి మధ్య పోరు బాగా ముదిరింది. అటుగా వెళుతున్న నక్క వాటిని చూసింది. బలంగా కొట్టుకుంటుండటంతో మేకపోతుల నుదుటిపై రక్తం కారసాగింది. ఆ రక్తాన్ని చూసిన వెంటనే నక్కకు నోరూరింది. ఎలాగైనా మేకపోతులను తినేయాలనే ఆలోచనతో ముందుకు దూకింది. అప్పుడే మేకపోతులు దూరంగా జరిగి ఢీ కొట్టడానికి లంఘించాయి. సరిగ్గా నక్క వాటి మధ్యలో పడింది. అంతే వాటి ధాటికి నక్క విలవిల్లాడుతూ చనిపోయింది. వెనకా ముందూ ఆలోచించకుండా దూకి నక్క ప్రాణాలు పోగొట్టుకుంది. 

Updated Date - 2020-12-21T05:30:00+05:30 IST