ఇంటిని పరిశీలిస్తున్న శ్రావణ్‌కుమార్
మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్
అరకులోయ, మార్చి 27: పెదలబుడు పంచాయతీ పాణిరంగిని గ్రామంలో భారీ వృక్షం కూలి ధ్వంసమైన ఇళ్ల యజమానులను ఆదుకోవాలని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం పాణిరంగిని బాధితులు సమర్ది జమున, అద్దు కుటుంబాలను ఆయన పరామర్శించారు. చింత చెట్టు కూలడంతో రెండు ఇళ్లు బాగా దెబ్బతిన్నాయని, ఎవ్వరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులు స్పందించి బాధిత కుటుం బాలకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ మంత్రి వెంట జడ్పీటీసీ మాజీ సభ్యుడు సాగర సుబ్బారావు, టీడీపీ అధికార ప్రతినిధి శెట్టి అప్పాలు, మాజీ వైస్ ఎంపీపీ పొద్దు అమ్మన్న, మండల మహిళా ఉపాధ్యక్షురాలు ద్రౌపతి, దారెల సర్పంచ్ పాండురంగస్వామి, టీడీపీ నాయకుడు సొనాయి కృష్ణారావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.