Advertisement

విద్యాలయాల్లో విధ్వంసం!

Sep 23 2020 @ 01:42AM

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు

బార్‌లను తలపిస్తున్న తరగతి గదులు 

‘కరోనా’ వేళ.. స్మోకింగ్‌ స్పాట్లుగా పాఠశాలలు

నిత్యం మద్యం తాగుతూ నానా విధ్వంసం సృష్టిస్తున్న మందుబాబులు

కామారెడ్డి బాలికల పాఠశాలలో మద్యం తాగుతూ.. పేకాట ఆడుతూ జల్సాలు

ప్రభుత్వ పాఠశాల గదుల తలుపులు, కిటికీలను పగులగొట్టి తగులబెడుతున్న దుండగులు

పాఠశాలకు వాచ్‌మెన్‌లు ఉన్నా.. అటువైపు కన్నెత్తి చూడని దుస్థితి

కనీసం పోలీసులు దృష్టి సారించకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు


కామారెడ్డి టౌన్‌, సెప్టెంబరు 22: కరోనా మహమ్మారితో గత కొన్ని నెలలుగా విద్యాసంస్థలు మూతపడడం.. విద్యార్థులు, ఉపాధ్యాయులు రాకపోవడంతో పాఠశాలలే మందుబాబులకు బార్‌లుగా తయారవుతున్నాయి. బయట ఎక్కడో కూర్చోని తాగితే బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్నందుకు పోలీ సులు కేసులు పెడతారని ఆలోచన చేశారమో గానీ పాఠశాల ల్లోనే మద్యం తాగేందుకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ఆవాసాలుగా చేసుకున్నారు. విద్యాలయాలు ఆధునిక దేవాల యాలు అని మర్చిపోతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలనే పేకాట స్థావరాలుగా, స్మోకింగ్‌ స్పాట్లుగా మార్చే స్తూ పనిలో పనిగా పాఠశాల కిటికీలు, తలుపులను సైతం పగులగొట్టి అందులో ఉన్న బల్లలను  విరగ్గొట్టడం, తలుపుల ను తగులబెడుతున్నారు. దీంతో విద్యార్థులకు ఎలాంటి సౌకర్యా లు లేకుండా చేస్తున్నారు. అయినా విద్యాశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. కామారెడ్డి మం డలంలోని పలు పాఠశాలలో వాచ్‌మెన్‌లు ఉన్నా నెలసరి జీతం అందుకుంటూ ఇళ్లలోనే కూర్చుంటున్నారే తప్ప రోజుకు ఒక్కసారైన పాఠశాల పరిస్థితి ఎలా ఉంది అనేది చూడడం లేదు. తాము ఎంతగానో మందుబాబులను మందలించినా వారు తిరగబడుతూ బూతుపురాణాలు అందుకుంటు న్నారని స్థానికులు పేర్కొంటున్నారు. కనీసం పోలీసులు సైతం దృష్టి సారించకపోవడంతో పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు సైతం ఇబ్బందులకు గురవు తున్నారని చెబుతున్నారు.


జల్సాలకు పాఠశాలలే అడ్డాలు

కామారెడ్డి మండలంలోని పలు పాఠశాలలు ఆకతాయిల జల్సాలకు అడ్డాలుగా మారు తున్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతుండడం విద్యార్థులకు ఏవైనా సందే హాలు ఉంటే నివృత్తి చేసేందుకు, ఆన్‌లైన్‌ తరగతులు ఏ విధంగా కొనసాగుతున్నాయి. విద్యార్థులు ఎంతమేర తరగతులను వింటున్నారనే పర్యవేక్షణ చేయడానికి పాఠశాలలకు హాజరవుతున్న ఉపాధ్యాయులకు అక్కడి పరిస్థితులను చూసి నివ్వెరపోతు న్నారు. తాము పాఠశాల ఆవరణలోనే ఉన్నా.. సిగరెట్లు తాగడం, మద్యం తాగు తూ ఆకతాయిలు జల్సాలు చేస్తున్నారని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తు న్నారు. తాము మందలిస్తే తిరగబడుతున్నారని ఇక పాఠశాల మూసివేశాక వారి చేష్టలు విపరీతంగా ఉంటున్నాయని తరగతి గదిలోని బల్లలు, కిటికీలు, తలుపులు ధ్వంసం చేస్తున్నారంటున్నారు. జిల్లాలోని సదాశివనగర్‌, భిక్కనూరు, మాచారెడ్డి తదితర మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.


బాలికల పాఠశాలలో మద్యం, పేకాట ఆడుతూ విధ్వంసం

కామారెడ్డి పట్టణంలోని 27వ వార్డులోని ముదాంగల్లిలో ఉన్న జిల్లాపరిషత్‌ బాలికల పాఠశాల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు గుంపులు గుంపులుగా పాఠశాల భవ నాలపై, తరగతి గదులలో సిగరెట్లు, మద్యం, కల్లు తాగుతూ పేకాట ఆడుతూ నానా విధ్వంసం సృష్టిస్తున్నారు.  ప్రాథమిక పాఠశాలలోని భవనంలోని ఓ తర గతి గది పరిస్థితి బార్‌రూంను తలపిస్తోంది. ఎవరికీ కనిపించకుండా పైన ఉన్న తరగతి గదిలో మద్యం తాగుతూ, పేకాట ఆడు తున్నారని పాఠశాల పరిసరాలలో ఉన్న కాలనీవాసు లు చెబుతున్నారు. మద్యం మత్తులో గత రెండు రోజుల కిందట పాఠశాలలోని తరగతి గది తలుపులను ఊడబీకి తగుల బెట్టడం, తాళాలు వేసిన గదులను పగులగొట్టా రని పాఠశాలకు వాచ్‌మెన్‌ ఉన్నా అటు వైపు కన్నెత్తి చూడడం లేదంటున్నారు. పాఠశాలలో రెండు అంగన్‌వాడీ సెంటర్లలో ప్రస్తుతం పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తుండడంతో గర్భిణులు వస్తుండడంతో వారికి ఇబ్బ ందులు కలిగేలా ప్రవర్తిస్తున్నారన్నా రు. కనీసం పోలీసులు కూడా అటువైపు రావడం లేదని రోజుకు ఒక్కసారైనా పర్యవేక్షణ చేస్తే పాఠశాలల్లో ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని పలువురు అభిప్రాయప డుతున్నారు.


పలు పాఠశాలల్లో ఇదే పరిస్థితి

కేవలం బాలికల పాఠశాలనే కాకుండా గంజ్‌, బాలుర, హరిజనవాడ, ఇందిరానగర్‌, రాజీవ్‌నగర్‌ పరిసరాల్లోని పాఠశా లల్లో ఇదే పరిస్థితి నెలకొంది. బాలుర పాఠశాలలో సాయంత్రం వేళ మందు బాబులు మద్యం తాగుతూ ఘర్షణలు పడుతున్నారు. గతంలో ఈ పాఠశాలలో మద్యం తాగి ఘర్షణకు దిగి గాయాలపాలైన సందర్భా లు ఉన్నాయి. ఆయా పాఠశాలలకు వాచ్‌మెన్‌లు సైతం ఉన్నారు. జిల్లా పరిషత్‌ నుంచి వారికి నెలనెలా జీతం సైతం అందుతున్నా వారు విధులు మాత్రం నిర్వహించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ ప్రభా వం లేనప్పుడు కూడా పాఠశాలలో వాచ్‌మెన్‌లు విధులు నిర్వహించ డం లేదని ఆరోపణలు ఉన్నాయి. వారు విధులు సక్రమంగా నిర్వ హిస్తే పాఠశాలల్లో విధ్వంసం జరగకుండా ఉంటుందని అభి ప్రాయాలు వ్యక్తం అవుతున్నా యి. పాఠశాలలో జరుగుతున్న విధ్వంసంపై జిల్లా విద్యాశాఖా ధికారులను వివరణ కోరగా జిల్లా లో 90 పాఠశాలలకు వాచ్‌మెన్‌లు ఉన్నారని వారికి జిల్లా పరిషత్‌ నుంచి జీతాలు అందుతున్నాయన్నారు. వారు రాత్రి సమయంలో పాఠశాలలో విధులు నిర్వ హించాలని, సెలవు రోజుల్లో పాఠశాలలోనే ఉండాలని చెబుతున్నారే తప్ప వారు విధులు ఏ మేర నిర్వహి స్తున్నారనేది పర్యవేక్షణ చేయకపోవ డం గమనార్హం.

Follow Us on:
Advertisement
Advertisement