
కడప: టీడీపీ నేత ప్రభాకర్‌రెడ్డికి చెందిన నిమ్మ తోటను ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. 80 నిమ్మ చెట్లను దుండగులు నరికివేశారు. చక్రాయపేట మండలం చెట్లవాండ్లపల్లిలో ఈ ఘటన జరిగింది. బాధితుడు ప్రభాకర్‌రెడ్డితో కలిసి తోటను ఎమ్మెల్సీ బీటెక్ రవి పరిశీలించారు. పులివెందులలో టీడీపీ శ్రేణులపై ఎలాంటి దాడులు జరిగినా వైఎస్ కుటుంబీకులే బాధ్యత వహించాలని రవి హెచ్చరించారు.