గంజాయి మొక్కల ధ్వంసం

Jun 16 2021 @ 23:08PM
తాడ్వాయిలో గంజాయి మొక్కలను పట్టుకున్న ఎక్సైజ్‌ అధికారులు

తాడ్వాయి, జూన్‌ 16: మండల కేంద్రంలోని చిట్యాల రోడ్డులో ఏడు అడుగుల ఎత్తు గల మూడు గంజాయి మొక్కలను జిల్లా టాస్క్‌ఫోర్స్‌, ఎక్సైజ్‌శాఖ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఓ ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలను పెంచుతున్నారనే సమాచారం మేరకు దాడిచేసి పట్టుకున్నట్లు ఎస్‌ఐ సాయన్న తెలిపారు. గంజాయి మొక్కలు పెంచుతున్న సంతోష్‌కుమార్‌ను అరెస్టు చేయడంతో పాటు చెట్లను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ శివకృష్ణ, సిబ్బంది రవి, సంగయ్య, శ్రీకాంత్‌, సరిత తదితరులు పాల్గొన్నారు.

Follow Us on: