విగ్రహాల ధ్వంసం పార్టీల పనే: డీఐజీ పాలరాజు

ABN , First Publish Date - 2021-01-22T09:11:43+05:30 IST

విగ్రహాల ధ్వంసానికి సంబంధించి నమోదైనవాటిలో తొమ్మిది కేసుల్లో ఉన్న వ్యక్తులు రాజకీయ పార్టీలకు చెందిన వారేనని పోలీసులు మరోసారి స్పష్టం చేశారు.

విగ్రహాల ధ్వంసం పార్టీల పనే: డీఐజీ పాలరాజు

అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): విగ్రహాల ధ్వంసానికి సంబంధించి నమోదైనవాటిలో తొమ్మిది కేసుల్లో ఉన్న వ్యక్తులు రాజకీయ పార్టీలకు చెందిన వారేనని పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. ఈ అంశంపై డీఐజీ పాలరాజు గురువారం విలేకరులతో మాట్లాడారు. ఆలయాల ధ్వంసానికి నిరసనగా తిరుపతి కపిలతీర్థం నుంచి విజయనగరం రామతీర్థం వరకు బీజేపీ తలపెట్టిన యాత్రకు అనుమతి ఇస్తున్నారా అని ప్రశ్నించగా, దీనిపై న్యాయ నిపుణుల సలహా తీసుకొంటున్నట్టు పాలరాజు తెలిపారు. ‘‘ఆలయాల రక్షణలో ఎక్కడా రాజీ పడటంలేదు. అయినా పోలీసులపై దుష్ప్రచారం చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారాలు చేయవద్దు. మాకు కులమతాల్లేవు. పరమత సహనానికి ఏపీ చిరునామా. రాష్ట్రంలో ఎలాంటి వివక్షకూ తావివ్వబోం’’ అని పాలరాజు పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-22T09:11:43+05:30 IST