ఏనుగుల దాడులతో టమోటా తోటల ధ్వంసం

ABN , First Publish Date - 2022-06-27T06:40:33+05:30 IST

సోమల మండలంలోని ఆవులపల్లె పంచాయతీలో శనివారం రాత్రి ఏనుగులు ప్రవేశించి టమోటా తోటలను ధ్వంసం చేశాయి

ఏనుగుల దాడులతో టమోటా తోటల ధ్వంసం

సోమల, జూన్‌ 26: మండలంలోని ఆవులపల్లె పంచాయతీలో శనివారం రాత్రి ఏనుగులు ప్రవేశించి టమోటా తోటలను ధ్వంసం చేశాయి. ఐరాల సమీ పంలో  సంచరిస్తున్న ఏనుగులు రెండు జట్లుగా విడిపోయాయి. ఒక జట్టు ఆవులపల్లె పంచాయతీ లోని కొత్తూరు, పట్రపల్లె, ఇర్లపల్లె పంటల్లో సంచరి స్తున్నాయి. మరో జట్టు పెద్దఉప్పరపల్లె పంచాయ తీలోని రెడ్డివారిపల్లె సమీపంలో సంచరించినట్లు రైతులు చెప్పారు. పట్రపల్లెకు చెందిన రైతలుఉ లక్ష్మణస్వామి, గుర్రప్పకు చెందిన  టమోటా, చెరకు పంటల్లో సంచరించి డ్రిప్‌ పరికరాలను, పంటలను ధ్వంసం చేశాయి. ఇర్లపల్లె సమీపంలోని పెద్ద పొద ప్రాంతంలో మాటు వేసి రాత్రి వేళ ఏనుగులు పం టలను ధ్వంసం చేస్తుతున్నట్లు రైతులు తెలిపారు. గాంధీనగర్‌ సమీపంలోకి ఏనుగుల మంద రావ డా న్ని గ్రామంలోని కుక్కలు గుర్తించి అరవడంతో ప్ర జలు ఇళ్లలోకి వెళ్లారు. పొలాల వద్దకు జట్లుగా వెళ్లి టపాసులు కాల్చినట్లు రైతులు చెప్పారు. మామిడి, టమోటా తోటలను కాపాడుకోవడానికి పలు ఇబ్బం దులు పడుతున్నామన్నారు.  వారం కిత్రం ఈ ప్రాం తంలోనే సంచరించి పంటలను ధ్వంసం చేసి వెళ్లి మళ్లీ వరుస దాడులు చేస్తుండడంతో రైతులు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. మామిడి, టమోటా కోతలు చేయలేక భయ పడుతున్నారు. పది రోజులు క్రితం ఆవులపల్లె పరిసరాల్లో సంచరించి పంటలను ధ్వంసం చేశాయి. సుమారు రూ.3లక్షల మేరకు పంట నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. 

Updated Date - 2022-06-27T06:40:33+05:30 IST