హెచ్‌ఆర్‌ఎంఎ్‌సలో వివరాలను నమోదుచేయాలి

ABN , First Publish Date - 2022-05-22T05:55:27+05:30 IST

పోలీసుశాఖ సిబ్బంది పూర్తివివరాలను హెచ్‌ఆర్‌ఎంఎ్‌సలో నమోదుచేయాల ని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి శనివారం నిర్వహించి న వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

హెచ్‌ఆర్‌ఎంఎ్‌సలో వివరాలను నమోదుచేయాలి
డీజీపీతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

డీజీపీ మహేందర్‌రెడ్డి


సూర్యాపేటక్రైం, మే 21: పోలీసుశాఖ సిబ్బంది పూర్తివివరాలను హెచ్‌ఆర్‌ఎంఎ్‌సలో నమోదుచేయాల ని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి శనివారం నిర్వహించి న వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అనంతరం ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ, హెచ్‌ఆర్‌ఎంఎ్‌స నిర్వహణకు జిల్లా లో ప్రత్యేక టీం పనిచేస్తోందన్నారు. సిబ్బంది సర్వీ స్‌, సెలవులు, వేతనం, ఇంక్రిమెంట్‌, ట్రైనింగ్‌, పదోన్నతుల వంటి వివరాలను ఒకేచోట పొందుపరిచేందుకు హెచ్‌ఆర్‌ఎంఎ్‌స ఉపయోగపడుతోందన్నారు.


అభివృద్ధికి టెర్రరిజం విరోధం

అబివృద్ధికి టెర్రరిజం విరోధమని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం నిర్వహించిన ఉగ్రవాద దినోత్సవంలో పోలీస్‌ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉగ్రవాదం అంతానికి పోలీ్‌సశాఖ కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐ నర్సింహారావు, శ్రీనివాస్‌, గోవిందరావు, ఎస్‌బీ సీఐ శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:55:27+05:30 IST