విద్యార్థుల ఉపకార వేతనాల వివరాలు సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2022-05-26T04:10:15+05:30 IST

జిల్లాలోని పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థుల ఉపకార వేతనాల వివరాలను సిద్ధంచేసి అందించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబందిత శాఖల అధికారులతో సమీక్షించారు.

విద్యార్థుల ఉపకార వేతనాల వివరాలు సిద్ధం చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, మే 25: జిల్లాలోని పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థుల ఉపకార వేతనాల వివరాలను సిద్ధంచేసి అందించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబందిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల, ఉపాధ్యాయుల, ఇతర సిబ్బంది వివరాలను సేకరించి ఐఎస్‌ఎంఎస్‌ పోర్టల్‌లో నమోదు చేయా లని తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యా యులు ఆన్‌లైన్‌ ద్వారా సంబంధిత ఫార్మాట్‌ను డౌన్‌లోడ్‌ చేసి వివరాలను పరిశీ లించి పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ఆయా పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలోని తరగతి గదులు, మూత్ర శాలలు, తాగునీరు, ప్రహరీ, క్రీడామైదానం, విద్యుత్‌, కంప్యూటర్స్‌ వివరాలను కూడ నమోదు చేయాలని అదేశించారు. సమావే శంలో డీఈవో ఆశోక్‌, డీడీ మణెమ్మ, డీఐఈవో శ్రీధర్‌ సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-26T04:10:15+05:30 IST