ముదిగేడులో అక్రమ మైనింగ్‌ వివరాల సేకరణ

ABN , First Publish Date - 2022-05-19T04:43:55+05:30 IST

మండలంలోని ముదిగేడులో సర్వేనెంబరు 181, 182లో ఉన్న 26.60 ఎకరాల్లో ఓ ప్రజాప్రతినిధి ఎటువంటి రాయల్టీ చెల్లించకుండా జరుపుతున్న అక్రమ మైనింగ్‌పై సెబ్‌ అధికారులు బుధవారం పరిశీలించి వివరాలు సేకరించారు.

ముదిగేడులో అక్రమ మైనింగ్‌ వివరాల సేకరణ
మైనింగ్‌ ప్రాంతం వద్ద వివరాలు సేకరిస్తున్న సెబ్‌ అధికారులు

పొదలకూరు, మే 18 : మండలంలోని ముదిగేడులో సర్వేనెంబరు 181, 182లో ఉన్న 26.60 ఎకరాల్లో ఓ ప్రజాప్రతినిధి ఎటువంటి రాయల్టీ చెల్లించకుండా జరుపుతున్న అక్రమ మైనింగ్‌పై సెబ్‌  అధికారులు బుధవారం పరిశీలించి వివరాలు సేకరించారు. ఆ గ్రామానికి చెందిన అక్కెం బుజ్జిరెడ్డి సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌కు ఈ అక్రమ మైనింగ్‌పై వివిధ దినపత్రికల్లో వచ్చిన కథనాలను జత చేసి ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ మైనింగ్‌ వల్ల  తన నిమ్మ, పత్తి, సవక తోటలకు నష్టం జరుగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కలెక్టర్‌ ఆదేశాలతో సెబ్‌ అధికారులు గ్రామంలోని మైనింగ్‌ ప్రాంతంలో వివరాలను సేకరించి  నివేదిక తయారు చేశారు. రిపోర్టును కలెక్టర్‌కు నివేదించనున్నట్లు సెబ్‌ అధికారులు తెలిపారు. ఇప్పటికే మైనింగ్‌ కార్యకలాపాలను నిర్వాహకులు కూడా ఆపేసినట్లు సమాచారం. ఈ తనిఖీల్లో రాపూరు సెబ్‌ ఇన్‌చార్జ్‌ సీఐ సీహెచ్‌ శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T04:43:55+05:30 IST