Advertisement

వివరాలు నిర్ణీత ప్రొఫార్మాలో సమర్పించాలి

Jan 17 2021 @ 01:01AM
మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, జనవరి 16: భూములకు సంబంధించిన వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో సమర్పించాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ జి.సంధ్యారాణితో కలిసి భూ సంబంధ వివరాల పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 11న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలపై సమీక్షిస్తూ జిల్లాలో రెవెన్యూ కోర్టు ఏర్పాటు, పెండింగ్‌ మ్యూటేషన్స్‌, కంపెనీలు, సంస్థలు, ఎన్‌ఆర్‌ఐలకు సంబంధించిన వివరాలు, ఆధార్‌ పెండింగ్‌ కేసులు, పట్టాదార్‌ పాస్‌బుక్‌లో తప్పిపోయిన భూముల విస్తీర్ణం, ఎల్‌టీఆర్‌ కేసులు, నిషేదిత ఆస్థు ల వివరాలు, సాదాబైనామాల పూర్తి సమాచారాన్ని సమర్పించాలన్నారు. సమావేశంలో ఆర్డీవో జాడి రాజేశ్వర్‌, అధికారులున్నారు. 

కొవిడ్‌ నిబంధనల మేరకు పాఠశాలల పునః ప్రారంభం

విద్యాసంస్థల పునఃప్రారంభ సమయంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు నిర్వహించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. వచ్చే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలు పున: ప్రారంభం సందర్భం గా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి విద్యా పరిశీలన కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 25లోగా ఆయా పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, మోడల్‌ స్కూల్‌, వృత్తి విద్య సంస్థలు, తదితర విద్యాలయాల్లో శానిటేషన్‌ ప్లాన్‌, లాజిస్టిక్‌ప్లాన్‌, మెడికల్‌ ప్లాన్‌లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి తరగతి గదిలో విద్యార్థుల మధ్య దూరం కనీసం 6ఫీట్లు ఉండాలని, ప్రతీ తరగతి గదిలో 20మందికి మించకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అత్యవసర సేవలు అందించేందుకు మెడికల్‌ క్యాంపులు ఏర్పాట్లు చేయాలని, ప్రతి విద్యాలయానికి రెండు గదులకు తక్కువ కాకుండా అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఏర్పాట్లు చేయాలని సూచించా రు. సమావేశంలో డీఈవో రవీందర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో రాథోడ్‌నరేందర్‌, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు సంధ్యారాణి, మున్సిపల్‌ కమిషనర్‌ రాజు, డీపీవో శ్రీనివాస్‌, సంక్షేమ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీయాలి 

కళా ఉత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లోని దాగి ఉన్న సాంస్కృతిక ప్రతిభను వెలికి తీయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. ప్రతి యేటా సర్వశిక్ష వారు నిర్వహిస్తున్న కళా ఉత్సవ్‌లో 2020-21లో జరిగిన జానపద గీతాలు, జానపద నృత్యాలు విభాగంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికలు భుక్తాపూర్‌ నుంచి శ్రీజ రాష్ట్రస్థాయి బహుమతి పొందింది. ఈ మేరకు డీఈవో రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసిన పదో తరగతి విద్యార్థి శ్రీజతో పాటు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మన్నూర్‌కు చెందిన విద్యార్థి కె.సునీల్‌ రాష్ట్ర స్థాయిలో రెండో బహుమతి పొందిన సందర్భంగా అభినందనలు తెలిపారు. ఇందులో సెక్టోరల్‌ అధికారి కంటె నర్సయ్య, శ్రీనివా్‌సరెడ్డి, ఉదయ్‌శ్రీతో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Follow Us on:
Advertisement