Karnataka: కళాశాల విద్యార్థుల ముద్దుల పోటీ...వీడియో Viral

ABN , First Publish Date - 2022-07-22T14:00:41+05:30 IST

కర్ణాటకలో విద్యార్థులను ముద్దుపెట్టుకుంటున్న వీడియో వైరల్‌గా మారిన...

Karnataka: కళాశాల విద్యార్థుల ముద్దుల పోటీ...వీడియో Viral

నిందితుడి అరెస్ట్...పోలీసుల దర్యాప్తు

మంగళూరు (కర్ణాటక):

‘‘ము..ము...ము..ము.. ముద్దంటే చేదా... నీకాఉద్ధేశం లేదా?

ఇప్పుడొద్దన్నావంటే చిన్నవాడా... రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా’’

అని ఓ సినీకవి రాసిన పాట గతంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.నేడు కర్ణాటకలో (Karnataka)విద్యార్థినీ విద్యార్థి (students) ముద్దుపెట్టుకుంటున్న(kissing) వీడియో(video) వైరల్‌గా మారిన తర్వాత పోలీసులు ఒకరిని అరెస్టు(arrest) చేశారు.ఇద్దరు విద్యార్థులు కళాశాల యూనిఫాంలో ఒకరినొకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు.వారి స్నేహితులు ఉత్సాహపరుస్తుండగా వీడియోలో వీరు పోటీ పడి ముద్దులు పెట్టుకున్నారు.విద్యార్థులు ముద్దుల పోటీ(kissing competition) నిర్వహించినట్లు కర్ణాటక పోలీసులు చెప్పారు. ప్రముఖ కళాశాలకు చెందిన ఓ యువకుడు, ఓ బాలిక ఇద్దరూ ఇక్కడి ఓ ప్రైవేట్‌ అపార్ట్‌మెంట్‌లో ముద్దుల్లో మునిగిపోయిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నగరంలోని కళాశాల అధికారులు, తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారింది. 


వీడియో తీసిన బాలుడిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆరు నెలల క్రితం ఓ ప్రైవేట్ ఫ్లాట్‌లో ఈ ఘటన జరిగిందని నగర పోలీసు కమిషనర్ ఎన్.శశికుమార్ తెలిపారు. వారం రోజుల క్రితం విద్యార్థి ఒకరు వాట్సాప్‌లో వీడియో పెట్టగా, అది వైరల్‌గా మారింది.దీంతో కళాశాల అధికారులు విద్యార్థులను హెచ్చరించి వారిని కళాశాల నుంచి సస్పెండ్ చేశారు. కళాశాల అధికారులుగానీ, తల్లిదండ్రులుగానీ ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని కమిషనర్‌ చెప్పారు.ముద్దుల పోటీ నిర్వహించే సమయంలో విద్యార్థులు డ్రగ్స్‌ వాడారా లేదా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-07-22T14:00:41+05:30 IST