పని ఇప్పిస్తామని యువతిని Hyderabad నుంచి ఢిల్లీకి రప్పించి.. ఏం చేశారో చూడండి..!

ABN , First Publish Date - 2022-05-15T19:27:18+05:30 IST

పని ఇప్పిస్తామని ఓ యువతిని ఢిల్లీ నుంచి నగరానికి పిలిపించి పడుపు వృత్తిలో దించారు. అంతటితో ఆగక ఆమెను వివస్త్రను చేసి నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసిన ముగ్గురు యువతులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు..

పని ఇప్పిస్తామని యువతిని Hyderabad నుంచి ఢిల్లీకి రప్పించి.. ఏం చేశారో చూడండి..!

యువతిని వివస్త్రను చేసి.. 

నిర్బంధించి చిత్రహింసలు

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : పని ఇప్పిస్తామని ఓ యువతిని ఢిల్లీ నుంచి నగరానికి పిలిపించి పడుపు వృత్తిలో దించారు. అంతటితో ఆగక ఆమెను వివస్త్రను చేసి నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసిన ముగ్గురు యువతులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. కోల్‌కతాకు చెందిన ఓ యువతి మసాజ్‌ థెరపిస్టు. ఈనెల 2న ఆమె ఢిల్లీలో జరిగిన ఓ ఫంక్షన్‌లో బంజారాహిల్స్‌కు చెందిన సంజన పరిచయం అయింది. హైదరాబాద్‌లో మసాజ్‌ థెరపిస్టులకు మంచి డిమాండ్‌ ఉందని, నగరానికి వస్తే పని ఇప్పిస్తానని సంజన చెప్పింది. ఆ మేరకు విమానం టికెట్‌ పంపించడంతో ఈనెల 9న సదరు యువతి నగరానికి వచ్చి సంజనా ఇంట్లోనే దిగింది.

అక్కడ పరిచయమైన కోమటి, సునీతలు మసాజ్‌తోపాటు ఇతర పనులు చేస్తే మరిన్ని డబ్బులు వస్తాయని చెప్పడంతో సదరు యువతి అంగీకరించింది. ఈనెల 12న కోమటి, సునీత, ఆ యువతి జూబ్లీహిల్స్‌లో కొందరికి థెరపీ చేసి బయటకు వచ్చాక వారి మధ్య గొడవ జరిగింది. కోల్‌కతా యువతి 100 డయల్‌కు ఫోన్‌ చేయడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు వచ్చి సర్ది చెప్పి పంపించారు. అనంతరం ఆ యువతి, కోమటి, సునీతలు వేర్వేరు కారులో వచ్చి జూబ్లీహిల్స్‌లో జరిగిన విషయాన్ని సంజనాకు చెప్పారు.


తప్పు చేసిందంటూ సంజనా, కోమటి, సునీతలు ఆమెతో వాగ్వాదానికి దిగి దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించినా వినిపించుకోకుండా ముగ్గురు కలిసి ఆమెను వివస్త్రను చేసి ఓ గదిలో నిర్బంధించి ఐరన్‌ రాడ్‌తో కొట్టారు. కళ్లలో సానిటైజర్‌, బేగాన్‌ స్ర్పే కొట్టి హింసించి, చంపేస్తామని బెదిరించారు. దీంతో భయపడ్డ ఆమె బాత్‌రూంలోని వెంటిలేటర్‌ ద్వారా తప్పించుకుంది. ఒంటి మీద దుస్తులు లేకున్నా పరుగులు తీస్తూ సమీపంలోని ఓ ఆస్పత్రికి వెళ్లింది. సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు ఫిర్యాదు స్వీకరించి నిందితులైన సంజనా, కోమటి, సునీతలను అరెస్టు చేసి పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2022-05-15T19:27:18+05:30 IST