క్షీణిస్తున్న శాంతిభద్రతలు - పోలీసుల మీనమేషాలు

ABN , First Publish Date - 2021-11-06T06:57:25+05:30 IST

పోలీసు అధికారుల ఉదాసీన వైఖరితో పట్టణంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే గ్యాంగ్‌వార్‌లు, దొంగతనాలు హడలెత్తిస్తున్నాయి.

క్షీణిస్తున్న శాంతిభద్రతలు - పోలీసుల మీనమేషాలు

తాడిపత్రి, నవంబరు 5: పోలీసు అధికారుల ఉదాసీన వైఖరితో పట్టణంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే గ్యాంగ్‌వార్‌లు, దొంగతనాలు హడలెత్తిస్తున్నాయి. సబ్‌డివిజనల్‌ స్థాయి అధికారి ఉన్న తా డిపత్రిలో రోజురోజుకు శాంతిభద్రతల పరిస్థితి దిగజారడం ఏమిటన్న ప్ర శ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల పట్టణంలో గ్యాంగ్‌వార్‌ అధికమవుతోంది. నందలపాడు, శ్రీనివాసపురం, ఆంజనేయస్వామిమాన్యం, పోరాటకాలనీ, టై లర్స్‌కాలనీ, చిన్నబజారు తదితర ప్రాంతాల్లో గ్యాంగ్‌లు ఉన్నాయి. ఆధిప త్యం కోసం దౌర్జన్యాలకు పాల్పడడం, కత్తులతో దాడులు చేయడం లాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. వారంరోజుల క్రితం నందలపాడు ప్ర ధాన సర్కిల్‌లో బాబు గ్యాంగ్‌, కంబగిరి గ్యాంగ్‌లు కత్తులు, రాడ్లతో దాడు లు చేసుకున్నారు. వెంటపడి ఒకరిపై ఒకరు కత్తులతో పొడుచుకున్నారు. ఈ పరిణామాలతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురై పరుగులు తీ శారు. దాడుల నుంచి తప్పించుకొనేందుకు రెండు గ్రూపుల్లోని వారు వీధు ల్లో పరిగెత్తుతూ తలుపులు తెరిచిన ఇళ్లలోకి దూరడంతో మహిళలు, పి ల్లలు హడలెత్తిపోయారు. వారంరోజులు కావస్తున్నా ఈ దాడులకు సంబంధించి ఇంతవరకు నిందితులను అరె్‌స్ట చేయకపోవడం పోలీసుల పనితీరు కు అద్దంపడుతోంది. వీరిదాడులకు ప్రధానకారణం గతంలో నందలపాడులోని ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద జరిగిన హత్యగా భావిస్తున్నారు. కొంతకాలం క్రి తం శ్రీనివాసపురంలో కూడా జరిగిన గ్యాంగ్‌వార్‌లో పలువురికి గాయాలయ్యాయి. పట్టణంలోని గాంధీకట్టవద్ద పోరాటకాలనీకి చెందిన గ్యాంగ్‌ జరిపిన దాడిలో ఒకరు కత్తిపోట్లకు గురయ్యారు. పట్టణంలోని చిన్నబజారులో రెండు వర్గాలు పరస్పరం కొట్టుకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసు లు అక్కడి వెళ్లేసరికి పారిపోయారు. 


పెట్రేగుతున్న దుండగులు

పట్టణంలో ఇటీవల దొంగతనాలు అధికమయ్యాయి. శ్రీనివాసపురం, శ్రీ రాములపేట, రాగితోటపాలెం, జయనగర్‌కాలనీ, కాల్వగడ్డవీధి, అంబేడ్కర్‌నగర్‌, టైలర్స్‌కాలనీలలో దొంగతనాలు జరిగాయి. ఇంతవరకు దొంగలను పట్టుకోవడం, అపహరించిన సొత్తును రికవరీ చేయడం గానీ పోలీసులు చేయలేదు. దొంగతనాలు జరగడం చూస్తే రాత్రి సమయంలో పోలీసులు గస్తీ చేస్తున్నారా? లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల రోడ్డుపై వెళుతున్న మహిళల మెడలోని బంగారు గొలుసులను ఎత్తుకెళుతున్న సం ఘటనలు కూడా పెరుగుతున్నాయి. పట్టణంలోని సంజీవనగర్‌లో 15 రోజుల క్రితం రోడ్డుపై వెళుతున్న మహిళ మెడలో నుంచి బైక్‌పై వచ్చిన ఇ ద్దరు వ్యక్తులు మూడుతులాల బంగారుగొలుసును లాక్కొని వెళ్లారు. అంతకు మునుపు పట్టణంలోని పుట్లూరురోడ్డులో మరో మహిళ మెడలో నుంచి కూడా ఇదేవిధంగా దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లారు. కొత్తబ్రిడ్జి వద్ద పెన్నాబండ్‌పై రాత్రి అయితే చాలు వాహనదారులు వెళ్లాలంటే భయకంపితులవుతున్నారు. కొందరు రౌడీమూకలు రోడ్డుకు అడ్డంగా నిలబడి వాహనదారులను ఆపి వారి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్లను బలవంతంగా లాక్కొంటున్నారు. అడ్డుకొనే ప్రయత్నం చేసిన వారికి కత్తులు చూపించి భ యపడిస్తున్నారు.


మిస్టరీ వీడని హత్య.. ఆపై దోపిడీ..

గతనెలలో పట్టణంలోని టైలర్స్‌కాలనీలో జరిగిన హత్య, ఆపై దోపిడీ ఘటన మిస్టరీని పోలీసు అధికారులు ఇంతవరకు ఛేదించకపోవడంపై వి మర్శలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తులో నత్తను పోటీపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. టైలర్స్‌కాలనీలో పట్టపగలు ఇంట్లో ఉంటున్న కొండన్నపై మారణాయుధాలతో దాడిచేసి హత్యచేశారు. ఆపై ఇంట్లో విలువైన వస్తువులతో పాటు దాదాపు రూ.80 వేల నగదును దోచుకెళ్లారు. హత్యచేసిన వారెవరన్న దానిపై పోలీసులు అనుమానితులను విచారిస్తూనే కాలం గడుపు తూ వస్తున్నారే తప్ప అసలైన నిందితులను పట్టుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. 


Updated Date - 2021-11-06T06:57:25+05:30 IST