AP News.. జగన్ రెడ్డిలో రోజురోజుకు విపరీతపు ఆలోచనలు..: దేవతోటి

Published: Wed, 17 Aug 2022 12:43:18 ISTfb-iconwhatsapp-icontwitter-icon
AP News.. జగన్ రెడ్డిలో రోజురోజుకు విపరీతపు ఆలోచనలు..: దేవతోటి

అమరావతి (Amaravathi): సీఎం జగన్ రెడ్డిలో (CM Jagan) రోజురోజుకు విపరీతపు ఆలోచనలు పెరిగిపోతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు (Devathoti Nagaraju) అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ "అంబేద్కర్ విదేశీ విద్య" పేరును తొలగించి.. "జగనన్న విదేశీ విద్య" అని పేరు పెట్టుకోవడం చూస్తుంటే.. జగన్ రెడ్డి తనకు తాను దైవాంశసంభూతుడనే పిచ్చి భ్రమలో ఉన్నారనిపిస్తోందన్నారు. భారతదేశానికి రాజ్యాంగం అందించి, ప్రపంచ మేధావిగా అంబేద్కర్ (Ambedkar) గుర్తింపు పొందారని, అలాంటి ఆయన తుగ్లక్ కంటే హీనంగా పరిపాలిస్తున్న జగన్ రెడ్డిచే అవమానింపబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల్లో అంబేద్కర్ స్ఫూర్తి కొరవడినంతకాలం.. జగన్ రెడ్డి లాంటి నేతలు తమకు తాము చక్రవర్తులుగా.. ప్రభువులుగా ఫీల్ అవుతూ.. దళితుల్ని బానిసలుగా చూస్తూనే ఉంటారని దేవతోటి నాగరాజు అన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.