సైన్స్‌పై ఆసక్తి పెంచుకోండి

ABN , First Publish Date - 2021-03-02T05:45:44+05:30 IST

విద్యార్థులు చిన్ననాటి నుంచే సైన్స్‌ పట్ల ఆసక్తి పెంచుకోవాలని డైట్‌ ప్రిన్సిపాల్‌ తిరుమల చైతన్య పిలుపునిచ్చారు. సోమవారం వమరవెల్లిలోని జిల్లా విద్యాశిక్షణ సంస్థ (డైట్‌)లో జాతీయ సైన్స్‌ వారోత్సవాల్లో భాగంగా సైన్స్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటుచేశారు.

సైన్స్‌పై ఆసక్తి పెంచుకోండి
గార : విద్యుత్‌ ప్రాజెక్టుపై వివరిస్తున్న విద్యార్థులు

డైట్‌ ప్రిన్సిపాల్‌ తిరుమల చైతన్య

వమరవెల్లి(గార) : విద్యార్థులు చిన్ననాటి నుంచే సైన్స్‌ పట్ల ఆసక్తి పెంచుకోవాలని డైట్‌ ప్రిన్సిపాల్‌ తిరుమల చైతన్య పిలుపునిచ్చారు. సోమవారం వమరవెల్లిలోని జిల్లా విద్యాశిక్షణ సంస్థ (డైట్‌)లో  జాతీయ సైన్స్‌ వారోత్సవాల్లో భాగంగా  సైన్స్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటుచేశారు. జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు రూపొందించిన సైన్స్‌ నమూనాలను ప్రదర్శిం చారు. సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు న్యాయ నిర్ణీతలుగా జిల్లా ఫిజిక్స్‌ ఫోరం సభ్యుడు పి.రవికుమార్‌, శ్రీనివాస్‌, కిరణ్‌కుమార్‌, వెంకటేశ్వరరావు వ్యవహరించారు. ఈ కార్య క్రమంలో  డైట్‌ సైన్స్‌ అధ్యాపకులు సూర్యప్రసాద్‌, సతీష్‌కుమార్‌, సురేష్‌, నాయుడు పాల్గొన్నారు. 

- వమరవెల్లి డైట్‌  విద్యార్థులు  రూపొందించిన ఆటోమెటిక్‌ సిగ్నల్‌ లైట్స్‌, మొక్కల్లో కిరణజన్య సంయోగం జరిపే విధానం తెలిపే నమూనా, విద్యుత్‌ స మాంతర శ్రేణి, ప్రయోగశాల ప్రదర్శన, వాతావరణం కాలుష్యం వల్ల ఆమ్లవర్షాలు ఎలా పడతాయో తెలియజేసే ప్రక్రియ తదితర ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. 

- డైట్‌ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు ఆదర్శ గ్రామం నమూనా ప్రాజెక్టు ఏర్పాటు చేశారు.


సోంపేటలో ...

సోంపేట : సోంపేటలోని మోడల్‌ పాఠశాలలో సైన్స్‌ దినోత్సవం పురస్కరించుకొని  సోమవారం నిర్వహించిన సైన్స్‌ ఎగ్జిబిషన్‌ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు సైన్స్‌ ప్రాజెక్టులను  ప్రిన్సిపాల్‌ దుంపల చిరంజీవి, ఉపాధ్యాయులు చౌదరి, శ్యామ్‌శ్రీ, జయశ్రీ పరిశీలించారు.

Updated Date - 2021-03-02T05:45:44+05:30 IST