ఒడ్డెలింగాపూర్ పీహెచ్‌సీని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సంజయ్
- ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
రాయికల్, మార్చి 27: పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా అని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. మండలంలోని కిష్టంపేటలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, కుమ్మరిపెల్లి గ్రామంలో రూ. 5లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులు, పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేశారు. అనంతరం రాయికల్ పట్టణంలో రూ.20లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, మున్సిపల్ బ్లేడ్ ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. మండలంలోని ఒడ్డెలింగాపూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాల్లో, గ్రామాల్లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఒడ్డెలింగాపూర్‌లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ప్రారంభం కరోనా కారణంగా ఆలస్యమైందని ఇప్పటికైనా ప్రారంభించడం ఆనందదాయకమన్నా రు. ప్రస్తుత బడ్జెట్లో విద్యా, వైద్యానికి అధిక స్ధాయిలో నిధులు కేటాయించారని అందులో భాగంగానే ఆశా వర్కర్లకు జీతాలు పెంచారని, బస్తీ, పల్లె దవఖానాలు సైతం ఏర్పాటు చేశారని అన్నారు. ప్రారంభించడం ముఖ్యం కాదని దీని సేవలు ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం ఆశావర్కర్లకు స్మార్ట్ఫోన్లను అందజేశా రు. తదనంతరం మండలంలోని కట్కాపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌తో కలిసి పరిశీలించారు. త్వరలోనే ప్రారంభిస్తామనితెలిపారు. వీరివెంట ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి, జడ్పీటీసీ జాదవ్ అశ్విని, మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ గన్నె రాజరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.