అభివృద్ధి,సంక్షేమ ఫలాలు అందిపుచ్చుకోవాలి

Sep 15 2021 @ 01:56AM

ఎమ్మెల్యే  వేణుగోపాల్‌

దర్శి, సెప్టెంబరు 14 : వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించుకొని సద్వినియోగం చేసుకోవాలని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి.వేణుగోపాల్‌ సూచించారు. స్థానిక లక్ష్మీవెంకటేశ్వర కల్యాణ మండపంలో మంగళవారం ఈసీ, ఈబీసీ కార్పొరేషన్‌ల ద్వారా అమలు అవుతున్న పథకాలు ఇతర ప్రభుత్వ పథకాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేణుగోపాల్‌ మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్‌ జగన్‌ నవరత్నాల పథకాలను అమలుజేస్తున్నారని వివరించారు. ఈబీసీలు, బీసీల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పథకాలు అమలుజేయనున్నట్లు తెలిపారు. అధికారులు ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బిసీ కార్పోరేషన్‌ ఈడీ ఎం.వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేకాధికారి కె.అర్జున్‌నాయక్‌, ఎంపీడీవో జి.శోభన్‌బాబు, నగర పంచాయతీ కమిషనర్‌ ఆవుల.సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

పౌష్టికాహారం వంటల పరిశీలన

 పౌష్టికాహర మాసోత్సవాల్లో భాగంగా ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార ప్రదర్శనను ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ ప్రారంభించారు. మహిళలు తయారు చేసిన వంటలను రుచి చూసి మహిళలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణకు పౌష్టికాహారం పెంపొందించే పదార్థాలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తక్కువ పెట్టుబడితో ఐసీడీఎస్‌ ద్వారా పౌష్టికాహారం తయారు చేయడం అభినందనీయమన్నారు. అంతకముందు మద్దిశెట్టి యూత్‌ ఆధ్వర్యంలో పుచ్చలమిట్టలో వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్‌ విగ్రహం వద్ద ఎమ్మెల్యే పూజలు చేశారు. భక్తులకు అన్నదానం చేశారు.  కార్యక్రమాల్లో దర్శి నియోజకవర్గ వైసీపీ నాయకులు మద్దిశెట్టి శ్రీధర్‌, మద్దిశెట్టి రవీంద్ర, తాళ్లూరు సీడీపీవో ఫణిరాజకుమారి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు హైమావతి, నాగమణి, అనురాధ, రాష్ట్ర బ్యూటీఫికేషన్‌ కార్పోరేషన్‌ డైరెక్టర్‌ కె.అంజిరెడ్డి, నాయకులు వై.వి.సుబ్బయ్య, ఎస్‌ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

మొక్కలను ఉద్యమంలా నాటాలి

తాళ్లూరు : ప్రతి ఒక్కరూ మొక్కలను ఉద్యమంలా నాటాలని దర్శి శాసన సభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్‌ తెలిపారు. భారతదేశ 75 సంవత్సరాల స్వేచ్ఛ స్వాతంత్ర్యాల పండుగ, భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవం సందర్భంగా సీపీ.బ్రౌన్‌సేవాసమితి, స్వాతంత్య్ర సమరయోధులు ఇడమకంటి బ్రహ్మారెడ్డి ధార్మిక మండలి ఆద్వర్యంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ మంగళవారం తాళ్లూరులో రహదారుల వెంబడి నీడ నిచ్చే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పూర్వం వనాలు అధికంగా ఉండి వాతావరణం సమతుల్యంగా ఉండడంతో వర్షాలు సకాలంతో కరిసేవన్నారు. ప్రస్తుతం చెట్లను నరకడం వల్ల ప్రస్తుతం వర్షాలు కురవక దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అంతరించి పోయిన వనాలను పునరుద్ధరించేందుకు తాళ్లూరు గ్రామసర్పంచ్‌ ఇడమకంటి పెద్దిరెడ్డి కుమారుడు స్వాతంత్య్ర సమరయోధులు ఇడకమంటి బ్రహ్మారెడ్డి ధార్మిక మండలి ఛైర్మన్‌ ఇడమకంటిలక్ష్మీరెడ్డి ముందుకు వచ్చి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉదృతంగా చేయడం అభినందనీయమన్నారు. దర్శి ఏఎంసీ చైర్మన్‌ ఐవేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ కార్యక్రమంలో భాగస్వాములై గ్రామాల్లో మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. ముందుగా పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ మొక్కను నాటారు. పోలీస్‌ స్టేషన్‌ వద్ద నుంచి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో వైసీపీ మండల ఇన్‌చార్జ్‌ మద్దిశెట్టి రవీంద్ర, వైసీపీనేత మద్దిశెట్టి శ్రీధర్‌, దర్శి ఏఎంసీ చైర్మన్‌ ఐవేణుగోపాల్‌రెడ్డి, వైసీపీ జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులు మారం వెంకటరెడ్డి, తాటికొండ శ్రీనివాసరావు,  ఇడమకంటి పెద్దిరెడ్డి, లక్ష్మీరెడ్డి,మన్నేపల్లి, నాగంబొట్లపాలెం సొసైటీ చైర్‌పర్సన్‌లు వలసారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు పులి ప్రసాద్‌రెడ్డి,పులి బ్రహ్మారెడ్డి, తహసీల్దార్‌ పి.బ్రహ్మయ్య, ఎంపీడీవో కెవీ కోటేశ్వరరావు,ఎస్సై బి.నరసింహారావు, సర్పంచ్‌లు ఎం.చార్లెస్‌సర్జన్‌, మారం ఇంద్రసేనారెడ్డి, ఎం.వెంకటేశ్వరరెడ్డి, కాలేషావలి, వైసీపీ నేతలు లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఐ.వెంకటేశ్వరరెడ్డి, జయరామిరెడ్డి, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

బ్రహ్మారెడ్డికి నివాళులు

తాళ్లూరు గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు , తామ్రపత్రగ్రహీత ఇడమకంటి బ్రహ్మారెడ్డి సమాధిని ఎమ్మెల్యే దర్శించారు.  పూల మాలలు ఉంచి ఘనంగా నివాళ్లు అర్పించారు. తాళ్లూరువాసి స్వాతంత్య్ర పోరాటం చేయడం గర్వించ దగిన విషయమన్నారు. కార్యక్రమంలో   బ్రహ్మారెడ్డి కుమారుడు మాజీ సర్పంచ్‌ ఐ.పెద్దిరెడ్డి,  సీపీ బ్రౌన్‌సేవాసమితి  అధ్యక్షులు ఐ.లక్ష్మీరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ ఐ.వేణుగోపాల్‌రెడ్డి,మారం వెంకటరెడ్డి, తాటికొండ శ్రీనివాసరావు, ఐ వెంకటేశ్వరరెడ్డి, ఎల్‌వెంకటేశ్వరరెడ్డి, చార్లె్‌ససర్జన్‌ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.